మరీ ఇలాంటి సైకో భార్య ఉంటే నరకమే.. ప్రతి సారి ఆ పని చేయమంటే ఎలా?
భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలి. అప్పుడే ఆ దాంపత్యం పదికాలాలపాటు పదిలంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం భార్యాభర్తల మధ్య అనుమానాలు అధికం అవుతున్నాయి. దంపతులు విడాకులు తీసుకోవడానికి కూడా అనుమానం పెనుభూతంగా మారుతోంది. ఇక్కడ ఓ మహిళ తన భర్తపై అనుమానం పెంచుకుంది. ఆ అనుమానం పిచ్చి పీక్స్ కు ఎక్కింది.. చివరకు సైకోలా మారింది.
ఇక విషయంలోకి వెళ్తే.. ఇంగ్లాండ్‌కు చెందిన డెబ్బీ వుడ్ అనే మహిళ తన భర్తపై అనుమానం పెంచుకుంది. దీంతో అతను బయటకు వెళ్లొచ్చిన ప్రతిసారి లై డిటెక్టర్ టెస్ట్ చేస్తుంది. ఆమె ఒథెల్లో సిండ్రోమ్ అనే అరుదైన మానసిక రుగ్మతతో బాధపడుతోంది. దానివల్ల ఆమె అనుమానం ముదిరి సైకోలా మారింది.
ఏం జరిగింది..
సాధారణంగా భర్తలపై భార్యలకు అనుమానం ఉండటం సహజం. అయితే ఇంగ్లాండ్‌కు చెందిన 52ఏళ్ల డెబ్బీ వుడ్‌కు మాత్రం ఆ అనుమానం పీక్స్ కు చేరింది. తన భర్త స్టీవ్ వుడ్ బయటకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చిన ప్రతీసారి ఏదో అనుమానంతో వ్యవహరించేది. దీంతో ఆయన బయకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చిన ప్రతీసారి లై డిటెక్టర్ టెస్ట్ చేస్తుంది. ఆ టెస్టుకు నో చెప్పినా పట్టుబట్టి మరీ ఒప్పిస్తుంది.

ఇక ఆయన మొబైల్, వాట్సాప్, ఈమెయిల్, సోషల్ మీడియా, బ్యాంక్ స్టేట్ మెంట్స్ అన్నీ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉంటుంది. ఆఖరికి టీవీలో మహిళలను చూస్తాడని షోస్ కూడా చూడకుండా అడ్డుకుంటుంది. ఆమె సైకో ప్రవర్తనతో విసిగిపోయిన భర్త స్టీవ్ వుడ్.. వైద్యులను సంప్రదించగా ఆమెకు ఒథెల్లో సిండ్రోమ్ అనే అరుదైన మానసిక రుగ్మత ఉందని నిర్ధారించారు.
స్టీవ్ వుడ్, డెబ్బీ వుడ్ ఒకరికొకరు 2011లో ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యారు. 2014లో వీరి వివాహం జరిగింది. స్టీవ్ ఆమె కంటే 10-12 సంవత్సరాలు చిన్నవాడు కావడం గమనార్హం. డెబ్బీ వుడ్ ను గతంలో పెళ్లిచేసుకున్న భర్తలు ఇలానే మోసం చేయడంతో ఆమె తన భర్త వ్యవహారంలో అనుమానం అధికమైనట్లు తెలుస్తోంది. ఈ కథనం తెలిసిన నెటిజన్లు మరీ ఇంత సైకో భార్యతో తట్టుకోవడం కష్టమేనని కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications