వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా మొరాయించిన ట్విట్టర్..

|
Google Oneindia TeluguNews

బ్రిటన్: ట్విట్టర్ పిట్ట ఒక్కసారిగా మొరాయించింది. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ఒక్కసారిగా ట్విట్టర్ సేవలు స్తంభించిపోయాయి. యూకె కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2.50గం. సమయంలో ట్విట్టర్ మొరాయించింది. ఆ తర్వాత 2.58గం. సమయంలో తిరిగి పనిచేయడం మొదలుపెట్టింది.

కానీ ఆ తర్వాత కొద్దిసేపటికే 3.01గం.కు మళ్లీ మొరాయించింది. ఆ తర్వాత 3.35గం.కు ట్విట్టర్ తిరిగి పనిచేయడం ప్రారంభించింది. ఈ అసౌకర్యానికి నెటిజెన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డౌన్‌డిటెక్టర్‌ అనే ఇంటర్నెట్‌ ట్రాకర్‌ ఈ విషయాన్ని ధృవీకరించింది.

Twitter DOWN – social network back online after today’s mystery outage

ఈశాన్య అమెరికా, యూకేలో కొన్ని ప్రాంతాలు, ఫ్రాన్స్‌, జపాన్‌, భారత్‌లలోని ట్విట్టర్ యూజర్లు ఈ టెక్నికల్‌ సమస్యను ఎదుర్కొన్నట్టు డౌన్ డిటెక్టర్ తెలిపింది. ట్విట్టర్ ను ఎక్కువగా ఉపయోగించే ప్రధాన ఆండ్రాయిడ్ యాప్ నుంచే 28శాతం ఫిర్యాదులు వెల్లువెత్తినట్టు తెలుస్తోంది. మరో 18శాతం ఫిర్యాదులు ఐప్యాడ్ యూజర్ల నుంచి వచ్చినట్టు సమాచారం.

ట్విట్టర్ స్తంభించిపోవడంపై ఇప్పటిదాకా స్పష్టమైన కారణమేది వెల్లడికాలేదు. సమస్య పరిష్కారమైనట్టు అధికారిక ప్రకటన మాత్రం వెలువడింది. 'కొంతమంది ట్విట్టర్ యూజర్స్ ట్వీట్స్ విషయంలో టెక్నికల్ సమస్యలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ సమస్య పరిష్కరించబడింది.' అని ట్విట్టర్ యాజమాన్యం ఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది.

English summary
The social network appears to have crashed for a large number of users globally, but it's now working as usual once again
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X