వెలుగులోకి విజయ గద్దె లాబీయింగ్: ఏకిపారేసిన హౌస్ కమిటీ..!!

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో నిబంధనలు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ట్విట్టర్ లీగల్ సెల్ మాజీ హెడ్ విజయ గద్దె- హౌస్ ఓవర్‌సైట్ కమిటీ విచారణకు హాజరయ్యారు.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటోన్న ట్విట్టర్ లీగల్ సెల్ మాజీ హెడ్, భారత సంతతికి చెందిన విజయ గద్దె యూఎస్ ఓవర్‌ సైట్ కమిటీ విచారణకు హాజరయ్యారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో అత్యంత వివాదాస్పదంగా మారిన అప్పటి డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ అక్రమాలను దాచి ఉంచినట్లు ఆరోపణలను ఆమె ఎదుర్కొంటోన్నారు.

హంటర్ బైడెన్ పై..

హంటర్ బైడెన్‌కు సంబంధించిన అత్యంత వివాదాస్పదమైన వేలాది ఇంటర్నల్ డాక్యుమెంట్స్.. ట్విట్టర్‌లో పబ్లిష్ కాకుండా అప్పటి లీగల్ హెడ్ విజయ గద్దె అడ్డుకున్నారనడానికి సాక్ష్యాధారాలు వెలుగులోకి వచ్చాయి. హంటర్ బైడెన్‌కు చెందిన ల్యాప్‌టాప్ వివాదాలకు సంబంధించిన పోస్టులు ఏవీ ట్విట్టర్‌లో పబ్లిష్ కాలేదు. ఇందులో అప్పటి లీగల్ డిపార్ట్‌మెంట్ హెడ్ విజయా గద్దె కీలక పాత్ర పోషించారని స్వయంగా ట్విట్టర్ చీఫ్ ఎలాన్ మస్క్ సైతం ప్రకటించారు.

అనైతిక కార్యకలాపాలతో..

అనైతిక కార్యకలాపాలతో..

అప్పట్లో హంటర్ బైడెన్ అనేక అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారని, అధ్యక్ష ఎన్నికల సమయంలో అవేవీ బయటికి రాకుండా జాగ్రత్త పడటంలో విజయ గద్దె కీలక పాత్ర పోషించినట్లు ది న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్ మ్యాట్ తైబ్బీ సైతం స్టేట్ మెంట్ ఇచ్చారు. వ్యసనాలకు బానిస అయ్యాడని, ఓ మహిళతో లైంగిక చర్యల్లో పాల్గొన్నప్పటి 12 నిమిషాల నిడివి ఉన్న వీడియో కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పారు.

విజయ గద్దె లాబీయింగ్..

ఉక్రెయిన్ కు చెందిన బురిస్మా ఎనర్జీ కంపెనీతో అమెరికా నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఒప్పందాలను కూడా కుదుర్చుకున్నాడని, అనైతిక, చట్టవిరుద్ధంగా అవి జరిగినట్లు మ్యాట్ తైబ్బీ స్పష్టంచేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో అవేవీ ట్విట్టర్ లో పబ్లిష్ కాలేదు. అప్పట్లో ట్విట్టర్ లీగల్ హెడ్ గా విజయ గద్దె పని చేశారు. ట్విట్టర్ ద్వారా వెలుగులోకి వస్తే డెమొక్రాట్లకు ఇబ్బందులు వస్తాయనే కారణంతో విజయ గద్దె లాబీయింగ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ అకౌంట్‌ను బ్లాక్ చేశారు.

కోవిడ్ సమాచారాన్ని సైతం..

గతంలో కరోనా వైరస్ కు సంబంధించిన సమాచారం కూడా ట్విట్టర్ లో పబ్లిష్ కాకుండా ఆమె అడ్డుకున్నారనే ఆరోపణలపైనా యూఎస్ హౌస్ కమిటీ విచారణ జరిపింది. కోవిడ్ సమాచారం సరైంది కాదని నిర్ధారించడానికి మీరు మెడికల్ స్టూడెంటా? ఏ స్కూల్ లో మెడిసిన్ చేశారంటూ కమిటీ సభ్యురాలు న్యాన్సీ మేస్ ప్రశ్నించారు. దీనికి విజయ గద్దె బదులిస్తూ- తాను మెడికోను కాదని అన్నారు. ఆ విషయం మాకు తెలుసు.. విలువైన కోవిడ్ సమాచారాన్ని ఎందుకు పబ్లిష్ కానివ్వలేదంటూ నిలదీశారు.

వైద్య విద్యా నిష్ణాతుల గొంతు నొక్కారు..

వైద్య విద్యా నిష్ణాతుల గొంతు నొక్కారు..

హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రఖ్యాత యూనివర్శిటీలకు చెందిన డాక్టర్లు తమ విలువైన కోవిడ్ సమాచారాన్ని పబ్లిష్ చేయడానికి బదులుగా వాటిని ఎందుకు సెన్సార్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. వారి గొంతులను నొక్కి వేశారంటూ యూఎస్ ఓవర్ సైట్ కమిటీ సభ్యులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిషేధిత ఛైల్డ్ పోర్న్ ను ట్విట్టర్ లో పబ్లిష్ చేయడానికి ఎలా అనుమతించారంటూ నిలదీశారు. ట్విట్టర్ మాజీ డిప్యూటీ అడ్వొకేట్ జేమ్స్ బేకర్, మాజీ ట్రస్ట్ అండ్ సేఫ్టీ వింగ్ హెడ్ యోయెల్ రోత్ కూడా ఈ విచారణకు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+