Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'మిస్ యూనివర్స్'పై ఫైర్, జుత్తు లేకే అని బోరుమన్న మిస్ జమైకా

మియామీ: మియామీలో జరిగిన విశ్వసుందరి పోటీల్లో మిస్‌ కొలింబియా పౌలినా వెగా విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, మిస్ జమైకాకు మిస్ యూనివర్స్ దక్కక పోవడం పైన ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విశ్వసుందరి-2014'గా అమెరికాకు చెందిన పౌలినా వెగా (22) సోమవారం కిరీటాన్ని గెలుచుకుంది. కొలంబియాలో ఆమె బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ చదువుతోంది. ఆదివారం రాత్రిబాగా పొద్దుపోయాక ఇక్కడ ఆడంబరంగా జరిగిన తుది పోటీల్లో పౌలినా వెగా విశ్వసుందరి (మిస్ యూనివర్శ్) కిరీటాన్ని దక్కించుకుంది.

 Twitter Weeps for Miss Jamaica as Miss Colombia Is Crowned Miss Universe

అయితే, మరో 22 ఏళ్ల అందగత్తె మిస్ జమైకాకు కిరీటం దక్కక పోవడంపై సామాజిక అనుసంధాన వెబ్ సైట్లలో విమర్శలు వచ్చాయి. మిస్ యూనివర్స్ కిరీటం మిస్ జమైకా గెలుచుకోవాల్సి ఉండెనని చాలామంది ట్విట్టర్లో అభిప్రాయపడ్డారు.

తనకు మిస్ యూనివర్స్ రాకపోవడం పైన మిస్ జమైకా కూడా స్పందించింది. తనకు ఉన్న పొట్టి జుత్తు వల్లనే కిరీటానికి అడుగు దూరంలో ఆగిపోవాల్సి వచ్చిందని చెప్పింది. కిరీటం గెలవడానికి కావాల్సిన అర్హతలను న్యాయనిర్ణేతలు ముందుగా చెప్పలేదని ఆమె వాపోయింది. ఈ పోటీల్లో మిస్ జమైకా టాప్ 5లో నిలిచింది. హాలీవుడ్ సుందరి హాలే బెర్రీ తరహా హెయిల్ స్టైల్ ఆమె కొంప ముంచిందట.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+