వెరీ ఇంట్రెస్టింగ్: షూ దుకాణంలో అన్నీ అవే దొంగిలించాడు (వీడియో)
Recommended Video

వర్జీనియా: అమెరికాలోని వర్జీనియాలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఫుట్‌వేర్ దుకాణంలోకి దొంగతనానికి వెళ్లి అక్కడ కేవలం ఓ కాలికి సరిపోయే చెప్పులు మాత్రమే తీసుకున్నాడు. అలా ఎందుకు చేశాడో తెలియదు. కానీ చెప్పుల జతలు తీసుకోకుండా ఓ కాలికి సరిపోయే చెప్పులు మాత్రమే దొంగిలించాడు.

సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది
ఇది అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. వీడియో ఫుటేజీలో అతను కేవలం కుడివైపు వేసుకునే షూను మాత్రమే తీసుకున్నాడు. ఈ సంఘటన గత శనివారం (స్థానిక కాలమానం ప్రకారం) ఉదయం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు చోటు చేసుకుంది.

డిస్ ప్లేలోని షూస్ దొంగిలించాడు
రోనోక్ నగరంలోని ఓ షు దుకాణంలో ఎవరూ లేని సమయంలో ఆ వ్యక్తి జొరబడ్డాడు. లోపలకు వెళ్లిన అతను డిస్ ప్లేలో ఉన్న ఎనిమిది షూలను దొంగిలించాడు. అయితే అవన్నీ కూడా కుడి కాలుకు వేసుకునే షూలు. ఎడమ వైపు వేసుకునే షూలను అక్కడే ఉంచాడు.

హడావుడిలో అలా ఎత్తుకెళ్లి ఉంటాడు
అతను దొంగతనం చేసే హడావుడిలో కేవలం కుడివైపు షూలే వదిలిపోయాడా లేక కేవలం కుడివైపు షూలే అవసరమయ్యాయా తెలియదు. అయితే దొంగతనం చేసే హడావుడిలో అలా తీసుకు వెళ్లాడని భావిస్తున్నారు.
ఎవరికీ కనిపించకుండా మాస్క్
ఈ దొంగతానికి సంబంధించిన వీడియోను రోనోక్ కంట్రీ పోలీస్ డిపార్టుమెంట్ విడుదల చేసింది. అందులో ఆ దొంగ ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు తన ముఖానికి మాస్క్ వేసుకున్నాడు. అతని వీడియోను విడుదల చేసి.. దర్యాఫ్తులో సహకరించాలని కోరారు.












Click it and Unblock the Notifications