Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Typhoon Yagi: 234 కి.మీ వేగంతో గాలులు.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద తుపాను!!

సూపర్ టైఫూన్ యాగీ.. ఈ సంవత్సరం ఆసియాను తాకిన అత్యంత శక్తివంతమైన తుఫాను. చైనాలో బీభత్సం సృష్టించిన ఈ తుఫాను ఇప్పుడు వియత్నాంను అతలాకుతలం చేసింది. శనివారం (సెప్టెంబర్ 7) ఉత్తర వియత్నాంలో ఈ తుఫాను ల్యాండ్‌ఫాల్ చేసింది. ఇది చైనాలోని దక్షిణ హైనాన్ ద్వీపాన్ని తుడిచిపెట్టింది. అక్కడ ఇద్దరు వ్యక్తులు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడినట్లు వాతావరణ సంస్థ తెలిపింది.

యాగీ.. 2024లో ప్రపంచంలో రెండవ అత్యంత బలమైన ఉష్ణమండల తుఫాను. వారం ప్రారంభంలో ఏర్పడిన తర్వాత ఫిలిప్పీన్స్‌లో ఇప్పటికే కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ఉత్తర వియత్నాంను స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1 గంటకు (ఉదయం 6 గంటలకు GMT) తాకింది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఇది గరిష్టంగా 234 kmph నుంచి ఒక రోజు ముందు హైనాన్ మీదుగా నమోదైంది.

Typhoon Yagi Asia s strongest storm Hits Vietnam after wreaking havoc in China

10 మిలియన్లకు పైగా ప్రజలు నివసించే హైనాన్‌లో.. ఈ పెను తుఫాను వేలాది చెట్లను నేలకూల్చింది. రోడ్లను వరదలు ముంచెత్తాయి. 800,000 గృహాలకు పైగా విద్యుత్ లేకుండా పోయింది.

వియత్నాంలో విధ్వంసం

ఈ తుఫాను కారణంగా.. రెండు మిలియన్ల జనాభా కలిగిన పారిశ్రామిక కేంద్రమైన, విదేశీ బహుళజాతి కంపెనీలు, స్థానిక వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్‌ల కర్మాగారాలకు నిలయంగా ఉన్న హైఫాంగ్ తీరప్రాంత నగరం అత్యంత నష్టపోయింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు అంతరాయాన్ని అధికారులు నివేదించారు. అత్యంత వేగంగా వీచిన గాలులు భవనాలపై విరుచుకుపడ్డాయి. దీంతో అద్దాల మేడలు ఊడ్చుకుపోయాయి. దీంతో ప్రజలు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. బయట ఉన్న వాహనాలు, జంతువులు, ఇతర వస్తువులు గాలి వేగానికి కొట్టుకుపోవడం గమనార్హం.

Typhoon Yagi Asia s strongest storm Hits Vietnam after wreaking havoc in China

రాయిటర్స్ ప్రకారం.. వియత్నామీస్ అధికారులు దాదాపు 50,000 మందిని తీర ప్రాంతాల నుంచి ఖాళీ చేయించారు. అత్యవసర చర్యలకు సహాయం చేయడానికి 450,000 మంది సైనిక సిబ్బందిని మోహరించారు . ఉత్తర వియత్నాంలో అత్యంత రద్దీగా ఉండే హనోయిలోని నోయి బాయితో సహా నాలుగు విమానాశ్రయాలు చాలా గంటలపాటు మూసివేయబడ్డాయి. 300 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేశారు. రాజధానితో సహా 12 ఉత్తర ప్రావిన్స్‌లలోని పాఠశాలలు కూడా మూసివేశారు.

Typhoon Yagi Asia s strongest storm Hits Vietnam after wreaking havoc in China

వాతావరణ మార్పు ప్రభావం

వాతావరణ మార్పులతో ముడిపడి పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతల కారణంగా టైఫూన్లు బలంగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గత వారం, టైఫూన్ షన్షాన్ నైరుతి జపాన్‌ను దెబ్బతీసింది, ఇది దశాబ్దాలలో దేశాన్ని తాకిన అత్యంత తీవ్రమైన తుఫాను. "మేక", మకర రాశికి జపనీస్ పదం పేరు యాగీని ఈ తుఫానుకు పెట్టారు. ఈ తుఫాను ముప్పు ఇంకా ఉందని చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+