తొలిసారి: గాజాలో కాల్పుల విరమణకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి డిమాండ్

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UN security council) కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్, పాలస్తీనాకు సంబంధించిన హమాస్ మిలిటెంట్ల మధ్య తక్షణం కాల్పుల విరమణ అమలు చేయాలని యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ డిమాండ్ చేసింది. కాగా, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇలా డిమాండ్ చేయడం తొలిసారి కావడం గమనార్హం.

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇజ్రాయెల్‌కు చెందిన బంధీలందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని యూఎన్ఎస్సీ స్పష్టం చేసింది. ఈ సమావేశానికి శాశ్వత సభ్యదేశం అమెరికా హాజరుకాకపోవడం గమనార్హం. భద్రతా మండలిలో 14 మంది సభ్యులు హాజరు కాగా, ఇందులో 10 మంది సభ్యులు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు.

U N Security Council for the first time demands immediate ceasefire in Gaza

గాజా ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ దాడులు సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంతమాత్రం ఆలస్యం కాకుండా ఈ దాడులకు ముగింపు పలకడమే మన బాధ్యత అని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం తర్వాత ఐక్యరాజ్యసమితిలో అల్జీరియా రాయబారి అమర్ బెండ్ జామా తెలిపారు.

ఇది ఇలావుంటే, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానంపై అమెరికావీటో ప్రయోగించాలని ఇజ్రాయెల్ ఆర్మీ కోరింది. అయితే, పవిత్ర రంజాన్ మాసంలో గాజాలో కాల్పుల విరమణ జరగడం కోసమే అమెరికా భద్రతా మండలి సమావేశానికి గైర్హాజరైనట్లు తెలుస్తోంది. కాగా, హమాస్‌ ఉగ్రవాదులను అంతం చేయడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటి వరుక సుమారు 32 వేల మంది మరణించినట్లు సమాచారం.

అయితే, వీరిలో వేలాది మంది పౌరులు కూడా ఉన్నారు. హమాస్ ఉగ్రవాదులు మొదట ఇజ్రాయెల్ పై దాడి చేసి తమ పౌరులను హతమార్చడంతో తిరిగి భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇటీవల గాజాలో తక్షణ కాల్పుల విరమణ పాటించాలని, హమాస్ వద్ద బంధీలుగా ఉన్నవారిని విడుదల చేయాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయిన విషయం తెలిసిందే. చైనా, రష్యా తమ వీటో అధికారాన్ని వినియోగించడంతో తీర్మానం వీగిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+