అరబ్ ఎమిరేట్స్‌లోని ఆ బిగ్ సిటీలో లాక్‌డౌన్: ప్రవేశం నిషేధం
అబుధాబి: ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుని విజృంభిస్తోంది. కొత్త మ్యూటెంట్ల..వేరియంట్లు పుట్టుకొస్తోన్నాయి. ఈ మహమ్మారిని నిర్మూలించడానికి ఒకవంక ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోన్నప్పటికీ.. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తోండటం పెను సవాల్‌గా మారింది. కరోనా వైరస్ డెల్టా వేరియంట్లు ఇప్పుడు ప్రమాదకరంగా పరిణమించాయి. కరోనా వైరస్ థర్డ్‌వేవ్‌కు ఇది దారి తీస్తోందనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి.
థర్డ్‌వేవ్ తరహా పరిస్థితులను నివారించడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోన్నాయి. ఈ పరిస్థితుల మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబి పాక్షిక లాక్‌డౌన్‌ను ప్రకటించింది. ఈ నెల 19వ తేదీన తెల్లవారు జామున 5 గంటల నుంచి పాక్షిక లాక్‌డౌన్ అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ మేరకు అబుధాబి అత్యవసర, సంక్షోభ పరిస్థితులు, వైపరీత్యాల నివారణ కమిటీ ఓ ట్వీట్ చేసింది. కోవిడ్ 19 మ్యూటెంట్లు వ్యాప్తి చెందుతోన్నాయని, వాటిని నివారించడానికి పాక్షికంగా లాక్‌డౌన్ విధించినట్లు తెలిపింది.

అబుధాబిలో ప్రవేశించడాన్ని పరిమితం చేశామని ఈ కమిటీ పేర్కొంది. కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అబుధాబికి వెళ్లాలనుకునే వారు ఈ నెల 19వ తేదీ నుంచి డిఫ్రాక్టివ్ ఫేస్ ఇంటర్‌ఫెరోమెట్రీ (DPI test) పరీక్షలను జరిపించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. 48 గంటల పాటు అబుధాబిలో నివసించ దలిచిన వారు డీపీఐ టెస్టులు, రెండు రోజులకు పైగా ఉండాలనుకునేవారికి పీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేసినట్లు వెల్లడించింది.
తాజా నిబంధనలు రెండు డోసులు లేదా ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా వర్తిస్తుందని అబుధాబి స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులను ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాల్సి ఉంటుందని సూచించింది. ఇదివరకట్లా స్వేచ్ఛగా నగరాల మధ్య రాకపోకలు సాగించడంపై ఆంక్షలు విధించామని తెలిపింది. ప్రజా రవాణాలో సీట్ల సామర్థ్యాన్ని 50 శాతానికే పరిమితం చేసింది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications