యుకె ఎన్నికల ఫలితాలు 2024 : కొంప ముంచిన రిషి సునాక్..!

UK elections Results 2024: బ్రిటన్‌ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ భారీ ఓటమిని ఎదుర్కొనడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష లేబర్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయ కేతనాన్ని ఎగురవేస్తుందంటూ అక్కడి ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. ఫలితాలు సైతం దీనికి అనుగుణంగా వెలువడుతున్నాయి.

650 సీట్లు ఉన్న బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్.. 326. భారతీయ మూలాలు ఉన్న ప్రధానమంత్రి రిషి సునాక్ సారథ్యంలో మొన్నటివరకు కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. 2019 నాటి ఎన్నికల్లో ఈ పార్టీకి దక్కిన సీట్ల సంఖ్య 344. 205 మంది సభ్యుల బలంతో లేబర్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది.

UK elections results 2024 Labour Party wins 81 seats and Conservaties at 7

స్కాటిష్ నేషనల్ పార్టీ- 43, లిబరల్ డెమొక్రాట్స్- 15, డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ- 7, సిన్ ఫెయిన్- 7 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం బ్రిటన్‌లో ఎన్నికల ప్రచారపర్వం విస్తృతంగా సాగుతోంది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉంది కన్జర్వేటివ్ పార్టీ. బోరిస్ జాన్సన్, థాచర్ మే, డేవిడ్ కామెరాన్, జాన్ మేజర్, మార్గరెట్ థాచర్.. వంటి హేమాహేమీలను అందించిన పార్టీ ఇది.

ఇప్పుడు ఫలితాలు తారుమారు అయ్యాయి. కన్జర్వేటివ్ పార్టీ ఘోర ఓటమిని చవి చూడబోతోందంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 410 స్థానాలతో లేబర్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అభిప్రాయపడ్డాయి. కన్జర్వేటివ్స్‌కు దక్కేవి 131 సీట్లేనని పేర్కొన్నాయి.

ఎన్నికల ఫలితాలు కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే వెలువడుతున్నాయి. సండర్‌ల్యాండ్‌ సౌత్‌లో తొలి విజయాన్ని అందుకుంది లేబర్ పార్టీ. ఆ పార్టీ అభ్యర్థి సర్ కీర్ స్టార్మర్ ఇక్కడి నుంచి ఘన విజయం సాధించారు. లేబర్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి కూడా ఆయనే. పూర్తి మెజారిటీతో లేబర్ పార్టీ అధికారంలో వస్తే స్టార్మర్.. ప్రధాని అవుతారు.

ఫలితాలు వెలువడుతున్న కొద్దీ లేబర్ పార్టీ ఆధిక్యత మరింత పెరగడం కనిపించింది. మొత్తం 81 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అదే సమయంలో కన్జర్వేటివ్స్ ఏడు నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం అయ్యారు. విచిత్రం ఏమిటంటే మరో ప్రతిపక్ పార్టీ లిబరల్ డెమోక్రాట్లు ఎనిమిది స్థానాలను గెలచుకున్నారు. అధికార పార్టీ మూడోస్థానానికి పరిమితమైంది ప్రస్తుతానికి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+