చెర్నోబిల్.. మళ్లీ భగ్గు: డెడ్లీ అటాక్- పొంచివున్న ఉపద్రవం

Russia- Ukraine conflict: రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధానికి అంతం అనేది ఉండట్లేదు. ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తోన్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి.

ఈ యుద్ధంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. భారీ స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.

Ukraine claimed Russian drone hit the shelter protecting the Chernobyl Nuclear Power Plant

మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పాశ్చాత్య దేశాల నుంచి ఎదురవుతోన్న ఒత్తిళ్లు, ఆంక్షలు, పలు రకాల నిషేధాలను కూడా రష్యా ధీటుగా ఎదుర్కొంటోంది.

రష్యా సైన్యానికి ఉక్రెయిన్ అంత తేలిగ్గా తలవంచట్లేదు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తోన్న ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతోంది. రష్యా ఆధీనంలో ఉన్న కొన్ని కీలక నగరాలను విడిపించుకోగలిగింది.

ఈ పరిస్థితుల మధ్య రష్యా మరో వివాదానికి తెర తీసింది. అత్యంత ప్రమాదకరమైన చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్లతో దాడి చేసింది. ఈ విద్యుత్ కేంద్రం నుంచి ఎలాంటి లీకేజీలు రాకుండా రక్షణ కల్పిస్తూ నిర్మించిన ఓ భారీ ప్రొటెక్టింగ్ షెల్టర్‌పై ఈ దాడి చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.

ఆ దేశ కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున 2:01 నిమిషాలకు ఈ దాడి జరిగింది. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో ఫుటేజీలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రొటెక్టింగ్ షెల్టర్‌‌పై దాడి జరగడం వల్ల ఇందులో నుంచి పెద్ద ఎత్తున రేడియేషన్ లీక్ కావడానికి అవకాశం ఉందనే భయాందోళనలు నెలకొన్నాయి.

ఈ విషయాన్ని అటు ఉక్రెయిన్, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ధృవీకరించాయి. రేడియేషన్ స్థాయిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోన్నట్లు ఐఏఈఏ తెలిపింది. ప్రస్తుతానికి రేడియేషన్ సాదారణ స్థాయిలోనే ఉందని, ప్రొటెక్టింగ్ షెల్టర్‌పై ఈ దాడి జరగడం, అది ధ్వంసం కావడం వల్ల మున్ముందు ఎలాంటి పరిస్థితి తలెత్తుతుందనే విషయంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోన్నామని పేర్కొంది.

రష్యా డ్రోన్ దాడి పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఘాటుగా స్పందించారు. అణు విద్యుత్ ప్లాంట్లను ఆక్రమించేలా, దానిపై దాడి జరిగితే సంభవించే పరిణామాలను కూడా పట్టించుకోకుండా యుద్ధం చేసే ఏకైక దేశం రష్యానేనంటూ మండిపడ్డారు. రేడియేషన్ వెలువడితే మొత్తం ప్రపంచానికే ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+