మరియుపోల్‌లో సైనికులు లొంగిపోవాల్సిందే.. రష్యా అల్టిమేటం : తగ్గేదిలేదన్న ఉక్రెయిన్ !!

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కీవ్, మరియుపోల్, ఉర్కిన్‌లతో పాటు ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్ది .. రష్యా సేనలు దాడులను తీవ్రతరం చేస్తున్నాయి. నివాస భవనాలు, ఆస్పత్రులు, స్కూళ్లను టార్గెట్ చేస్తూ క్షిపణులతో విధ్వంసానికి పాల్పడుతున్నాయి. ఏ నగరంలో చూసినా భయానక పరిస్థితులే కన్పిస్తున్నాయి. ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు హెచ్చరికలు జారీ చేస్తూ రష్యా సేనలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

ఉక్రెయిన్ బ‌ల‌గాలకు ర‌ష్యా హెచ్చ‌రిక‌..

ఉక్రెయిన్ బ‌ల‌గాలకు ర‌ష్యా హెచ్చ‌రిక‌..

ఉక్రెయిన్‌కు ప్రధాన ఓడరేవు ప్రాంతంగా ఉన్న మరియుపోల్ నగరంపై రష్యా బలగాలు బాంబుల వర్షం కురిస్తోంది. అటు స్థానిక ప్రభుత్వానికి వార్నింగ్ కూడా ఇచ్చింది. మరియుపోల్‌లో ఉన్న ఉక్రెయిన్ సైన్యం లొంగిపోవాలని రష్యా అల్టిమేటం జారీ చేసింది. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. అయితే రష్యా అల్టిమేటాన్ని మరియుపోల్ తిరస్కరించింది. తమ బలగాలు లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. రష్యా సేనలను దీటుగా ఎదుర్కొంటామని గట్టిగా కౌంటర్ ఇచ్చింది. మాస్కో సేనలు దాడులను తీవ్రతరం చేసిన నేపథ్యంలో మరియుపోల్ లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు.

రివ్న్ మిల‌ట‌రీ శిక్ష‌ణ కేంద్రంపై దాడులు

రివ్న్ మిల‌ట‌రీ శిక్ష‌ణ కేంద్రంపై దాడులు

తాజాగా ఉక్రెయిన్ కు పశ్చిమ ప్రాంతంలోనూ రష్యా దాడులను ముమ్మరం చేసింది. రివ్న్ మిలటరీ శిక్షణ కేంద్రంపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారో ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అటు రాజధాని కీవ్ లోని ఓ షాపింగ్ సెంటర్ పై ఫిరంగులతో దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో నలుగురు మృతి చెందినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. గత 26 రోజులుగా రష్యా బలగాలు దాడులు చేస్తున్నా ఉక్రెయిన్ సైన్యం దీటుగా ఎదుర్కొంటోంది. దీంతో రాజధాని కీవ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకోలేక పోయింది.ఈ నేప‌థ్యంలో రష్యా తన దాడులను మరింత పెంచింది.

ర‌ష్యాను ఎదుర్కొంటాం.. ఆయుధాలు ఇవ్వండి..

ర‌ష్యాను ఎదుర్కొంటాం.. ఆయుధాలు ఇవ్వండి..

మరో వైపు రష్యాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తమకు మద్దతు ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రపంచదేశాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. తమపై యుద్ధానికి దిగిన రష్యాకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడాలని ఇజ్రాయెల్‌ను కోరారు. హోలో కాస్ట్‌ను ప్రస్తావిస్తూ ఇజ్రాయెల్ శాసనకర్తలను ఉద్దేశించి జెలెన్ స్కీ భావోద్వేగ ప్రసంగం చేశారు.

వారి మద్దతును పొందేందుకు ప్రయత్నించారు. పశ్చిమ దేశాలు మాదిరిగా రష్యాపై ఆంక్షలు విధించాలని ఇజ్రాయెల్‌ను కోరారు. మాస్కో సేనలను ప్రతిఘటించేందుకు తమకు ఆయుధాలను సమకూర్చాలని కోరారు. యుద్ధానికి ర‌ష్యా ముగింపు ప‌ల‌కాల‌ని .. లేక‌పోతే తీవ్ర ప‌రిణామ‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+