రష్యాకు భారీ షాక్ : 15 వేల మంది సైనికులు హతం.. దూకుడు పెంచిన ఉక్రెయిన్ !!
రష్యా సేనల దాడులను ఉక్రెయిన్ బలగాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. కీలక నగరాలను హస్తగతం చేసుకునేందుకు బాంబుల వర్షం కురిపిస్తున్నా.. వాటిని దైర్యంగా ప్రతిఘటిస్తున్నారు. ఉక్రెయిన్ దళాలు రష్యా సేనలపై ఎదురు దాడులను తీవ్రతరం చేశాయి. అగ్రరాజ్యం అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు అందించిన ఆయుధాలతో విరుచుకుపడుతున్నాయి. రష్యా సైనికులను మట్టుబెడుతున్నాయి. యుద్ధ సామాగ్రిని ధ్వంసం చేస్తూ యుద్ధభూమిలో దూసుకెళ్తున్నాయి.. రష్యా బలం , బలగం ముందు .. ఉక్రెయిన్ చిన్నదే.. అయినా కథన రంగంలో మాస్కో బలగాలపై చిచ్చర పిడుగులా విరుచుకుపడుతోంది.

దాదాపు 15వేల మంది రష్యా సైనికులు హతం
యుద్దం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 15 వేల మంది రష్యా సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ తాజాగా వెల్లడించింది. 97 యుద్ధ విమానాలు, 121 హెలికాప్టర్లను, కూల్చివేశారు. 498 యుద్ధ ట్యాంకులు, 1535 యుద్ధ వాహనాలు , 240 ఫిరంగులను ధ్వంసం చేశారు. మూడు యుద్ధ నౌకలు, 45 యాంటీ ఎయిర్ కాప్ట్ వార్ ఫేర్ సిస్టమ్స్ ను నాశనం చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. రష్యా దాడులకు భయపడేది లేదు.. వెనక్కి దగ్గేది లేదని స్పష్టం చేసింది. శాంతి చర్చలకు తాము సిద్ధమే.. రష్యానే వాటిని ముందుకు సాగనియ్యడంలేదని ఆరోపించింది.

వాణిజ్య సంబంధాలు కట్ చేయండి..
మరోవైపు రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని యూరప్ దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు. ఆదేశంలో ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలను నిలిపివేయాలని పిలుపునిచ్చారు. తమ దేశంపై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఈ చర్చలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. జర్మనీ ప్రజలను ఉద్దేశించిన జెలెన్‌స్కీ కీలక ప్రసంగం చేశారు. రష్యా నుంచి చమురు దిగుమతులను వదిలేయడంతో పాటు ఆదేశానికి వస్తువుల సరఫరా నిలిపివేయాలని కోరారు. తమ దేశానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

జెరుసలేం వేదికగా చర్చిద్దాం..
అటు రష్యాతో తాము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి ప్రకటించారు. చర్చలు జరపడానికి జెరుసలేం సరైన ప్రదేశమని చెప్పారు. ఇరుదేశాల మద్య సయోధ్య కుదర్చడానికి ఇప్పటికే ఇజ్రాయెల్ తన వంతు ప్రయత్నాలు చేస్తోందన్నారు. వారి ప్రయత్నాలకు జెలెన్ స్కీ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే జెరుసలేం వేదికగా రష్యాతో చర్చలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే రష్యా -ఉక్రెయిన్ దేశాల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పురోగతి కన్పించలేద. రష్యాతో చర్చలకు సిద్ధమని మరోసారి సిద్ధమని ఉక్రెయిన్ ప్రకటించింది.












Click it and Unblock the Notifications