Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇరాన్ పై అమెరికా దాడుల ఎఫెక్ట్-ఐరాస భద్రతా మండలి అత్యవసర భేటీ..!

ఇజ్రాయెల్ తో ఇరాన్ యుద్దం చేస్తున్న సమయంలో ఆ దేశంపై అమెరికా జరిపిన దాడులు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇరాన్ లోని అణు స్ధావరాలను టార్గెట్ చేస్తూ అమెరికా జరిపిన ఈ భారీ దాడులపై ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ స్పందిస్తున్నాయి. ఇలా ఓ దేశంపైకి అకారణంగా దాడులు చేయడాన్ని తప్పుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇప్పటికే ఐరాస భద్రతా మండలి అత్యవసర భేటీ కోరింది. దీంతో కాసేపట్లో ఐరాస భద్రతా మండలి సమావేశమవుతోంది.

ఇరాన్ తో అమెరికా అణు చర్చలు విఫలం కాగానే ముందుగా ఇజ్రాయెల్ దాడుల్ని మొదలుపెట్టింది. దీనికి కౌంటర్ గా ఇరాన్ కూడా భారీగా ప్రతిదాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ లోని నతాంజ్, ఫోర్డో, ఇస్పాహన్ అణు విద్యుత్ కేంద్రాల్ని టార్గెట్ చేయడంలో విఫలమైన ఇజ్రాయెల్ అమెరికా సాయం కోరినట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన అమెరికా భారీ బాంబులతో వాటిపై దాడులు చేసింది. అయితే ఇరాన్ మాత్రం తమ అణు కేంద్రాలకు పెద్దగా నష్టం జరగలేదని చెబుతోంది.

UN security council emergency meet to discuss US attack on Iran

అయినా తమ దేశ సార్వభౌమత్వంపై అమెరికా జరిపిన దాడిపై ఐరాస చర్చించాలని పట్టుబడుతోంది. దీంతో ఇరాన్ కోరిక మేరకు అమెరికా దాడులపై చర్చించేందుకు భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 12.30కు ఐరాస భద్రతా మండలి సమావేశమవుతోంది. ఐరాస భద్రతా మండలిలో భారత్ తో పాటు అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా వంటి శాశ్వత సభ్యదేశాలు ఉన్నాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఈ దాడుల్ని సమర్థిస్తుండగా.. చైనా, రష్యా ఖండించాయి. ఈ నేపథ్యంలో ఐరాస భద్రతా మండలి ఈ దాడులపై ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

UN security council emergency meet to discuss US attack on Iran

ఇప్పటికే ఇరాన్ తమ దేశంపై అమెరికా జరిపిన దాడులపై మండిపడుతోంది. అయితే అంతకు ముందే ఈ యుద్ధంలోకి అమెరికా కానీ పశ్చిమ దేశాలు కానీ తలదూరిస్తే పశ్చిమాసియాలోని వాటి స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇప్పుడు అమెరికా ఈ యుద్ధంలో తలదూర్చి నేరుగా తమ అణు స్థావరాలపై దాడులు చేయడంతో ఇరాన్ తదుపరి చర్య ఏంటన్నది ఉత్కంఠ రేపుతోంది. అయితే ఇవాళ కూడా ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు కొనసాగాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+