ఒళ్లు గగుర్పొడిచే ఫుటేజ్: తుఫాన్ మధ్యలోకి వెళ్తే ఎట్టా ఉంటాదో చూస్తారా?

తుఫాన్ మధ్యలోకి వెళ్తే ఏమౌతుంది?, అక్కడ ఎలా ఉంటుంది? అనేది ఊహకు కూడా అందని విషయం. గంటకు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో సుడులు తిరిగే వలయానని దాటి తుఫాన్ ఐలోకి వెళ్లే సాహసం కూడా చెయరెవరూ. నిజానికి ఆ ప్రాంతం ప్రశాంతంగానే ఉంటుంది. పెద్దగా మేఘాలు ఉండవు. గాలి వేగం కూడా సాధరణంగానే ఉంటుంది. దాని చుట్టూ ఉండే క్లౌడ్ వాల్ రీజియన్ ను దాటుకుని వెళ్లడం అనేది దాదాపుగా సాధ్యపడదు.

అలాంటి సాహసం చేసింది అమెరికా వైమానిక దళానికి చెందిన ఓ ఫ్లైట్. ఈ ఏడాది అత్యంత శక్తిమంతమైన తుఫాన్ గా హరికేన్ మెలిస్సాలోకి అమెరికా గస్తీ విమానం దూసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 'హరికేన్ హంటర్స్' అనే ఎక్స్ యూజర్ దీన్ని పోస్ట్ చేశారు. ఈ వీడియోలు తుఫాను మధ్యభాగంలోని అరుదైన దృశ్యాలను కళ్లకు కట్టినట్టు చూపించాయి.

Unbelievable US Air Force Records Dramatic Footage Inside the Eye of Hurricane Melissa

వాతావరణ సంబంధిత సమాచారాన్ని సేకరించడానికి యూఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. సూర్యోదయం తర్వాత ఈ విమానం హరికేన్ మెలిస్సా మధ్య భాగంలోకి ప్రవేశించింది. తుఫాన్ ఆగ్నేయ దిశ నుంచి ఎంట్రీ ఇచ్చింది. కాంపౌండ్ వాల్ కట్టినట్టు చుట్టూ దట్టమైన మేఘాలు అలముకుని ఉండటాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఎటువంటి అలజడి లేకుండా ప్రశాంతంగా కనిపించిందీ మధ్యభాగం. హరికేన్ క్లౌడ్ వాల్ కు అవతలి వైపున సూర్యరశ్మి ప్రసరించడం.. ఇందులో స్పష్టంగా రికార్డయింది.

దీన్ని వాతావరణ పరిభాషలో "స్టేడియం ఎఫెక్ట్" అంటారు. హరికేన్ క్లౌడ్ వాల్ ఎత్తుకు వెళ్లే కొద్దీ స్టేడియం స్టాండ్స్ తరహాలో బయటికి వంగి ఉంటుంది. టాప్ వ్యూలో చూస్తే స్టేడియాన్ని తలపిస్తుంది. అందుకే- దీనికి ఆ పేరు పెట్టారు. తుఫాను తీరాన్ని తాకడానికి ముందు దాని మధ్యలో ఉన్న ప్రశాంతతను, చుట్టూ పెరుగుతున్న తీవ్రతను చూపే మరో రెండు వీడియోలను కూడా ఎయిర్ ఫోర్స్ పైలెట్లు రికార్డు చేశారు.

హరికేన్ మెలిస్సా క్రమంగా జమైకా వైపు కదులుతోంది. అక్కడే తీరాన్ని దాటే అవకాశం ఉందని అమెరికన్ వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది. దీన్ని కేటగిరీ 5 సైక్లోన్ గా ప్రకటించింది. జమైకా తీరాన్ని తాకిన అత్యంత శక్తిమంతమైన తుఫాను ఇదేనని నేషనల్ హరికేన్ సెంటర్ పేర్కొంది. జమైకాపై దీని ప్రభావం తీవ్రంగా పడింది. రాజధాని కింగ్‌స్టన్‌ లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. తీరప్రాంతంలో 13 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగిసిపడతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+