Aliens : అమెరికాపై ఏలియన్స్ సంచారం ? తోసిపుచ్చలేమన్న ఆర్మీ- సంచలన ప్రకటన..!
అమెరికాలో గత కొన్ని రోజులుగా గగనతలంలో ఎగురుతున్న అనుమాస్పద వస్తువుల్ని ఆర్మీ కూల్చేస్తోంది. ఇలా గత మూడు రోజుల్లో మూడు వస్తువుల కూల్చివేసిన ఆర్మీ.. దీనిపై సంచలన ప్రకటన చేసింది.
అమెరికాలో కొంతకాలంగా గాల్లో ఎగిరే వస్తువుల కలకలం మొదలైంది. వారం క్రితం ఇలా అమెరికాపైకి ఎగురుతూ వచ్చిన భారీ బస్సు సైజు బెలూన్ అణుకేంద్రాలపై తిరిగింది. దీంతో ముందు కాస్త ఆలోచించిన అధికారులు.. చివరికి కూల్చేశారు. ఆ తర్వాత వరుసగా దర్శనమిస్తున్న ఎగిరే వస్తువుల్ని ఏమాత్రం ఆలోచించకుండా కూల్చేస్తున్నారు. దీంతో ఈ కూల్చివేతల వ్యవహారం కలకలం రేపుతోంది.

అమెరికాకు ఎగిరే వస్తువుల భయం
అమెరికాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎగిరే వస్తువుల భయం కనిపిస్తోంది. ప్రపంచంలో అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాలో గగన తలంలోకి ఆ దేశం అనుమతి లేకుండా దూసుకొస్తున్న వస్తువులు.. అక్కడి ప్రజల్ని, ప్రభుత్వాన్ని భయపెడుతున్నాయి. దీంతో ఇంకా ఏయేం వస్తువులు ఇలా దూసుకొస్తాయో, ఎలాంటి ప్రమాదం మోసుకొస్తాయో అన్న భయం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలతో ఆర్మీ కూడా అంతే దీటుగా స్పందిస్తోంది. అమెరికా గగనతలంలో అనుమతి లేకుండా ఏ వస్తువు కనిపించినా కూల్చేస్తోంది.

మూడు రోజుల్లో 3 కూల్చివేతలు
అమెరికాలో గత మూడు రోజుల వ్యవధిలో మూడు గాల్లో సంచరిస్తున్న వస్తువుల్ని ఆర్మీ కూల్చేసింది. చైనా వాతావరణ మార్పులపై పరిశోధన కోసం ప్రయోగించామని చెప్పిన భారీ బెలూన్ తో మొదలైన కూల్చివేతలు ఇంకా కొనసాగుతున్నాయి. బెలూన్ కూల్చివేత తర్వాత గత మూడు రోజుల్లో మూడు ప్రదేశాల్లో ఇలా గాల్లో ఎగురుతున్న వస్తువుల్ని ఆర్మీ నిర్దాక్షిణ్యంగా విమానాల సాయంతో కూల్చేస్తోంది. దీంతో ఈ ఎగిరే వస్తువుల సంఖ్య ఇంకా పెరుగుతుందా లేదా అన్న దానిపై ఆర్మీ కూడా స్పష్టత ఇవ్వలేకపోతోంది.

ఏలియన్స్ సంచారం తోసిపుచ్చలేమన్న ఆర్మీ
ఉత్తర అమెరికా గగనతలాన్ని పర్యవేక్షిస్తున్న అమెరికా వైమానిక దళం జనరల్ గ్లెన్ వాన్‌హెర్క్ తాజాగా నాలుగో వస్తువును గుర్తుతెలియని వస్తువులను కూల్చేశాక దీనిపై స్పందించారు. ఈ అపరిచిత వస్తువులు గ్రహాంతరవాసులు కావొచ్చని లేదా మరేదైనా అయ్యే అవకాశాల్ని తోసిపుచ్చలేమని ప్రకటించారు. విదేశాల నుంచి లేదా అంతరిక్షం నుంచి ఎదురయ్యే ప్రతీ ముప్పును అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో అంతరిక్షం నుంచి ఏలియన్స్ సంచారంపై అమెరికా ఆర్మీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టమైంది.
-
హార్ముజ్ సంగతి తర్వాత-యుద్దం ముగించేద్దాం..! ట్రంప్ మరో షాక్ ..! -
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
Iran War: సీజ్ ఫైర్ పై తేల్చేసిన ఇరాన్..! ట్రంప్ కు ఘాటు కౌంటర్..! -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications