చైనాపై ఎందుకంత కోపం..? కారణం అదేనా..? భారత్ కు హ్యాపీ..!
అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. అగ్రరాజ్యంతో ఢీ అంటే ఢీ అంటూ సాగుతున్న చైనాపై సుంకాలు పెరిగిపోతున్నాయి. చైనాపై అమెరికా మరోసారి భారీ స్థాయిలో సుంకాలు విధించింది. దీంతో చైనాపై అమెరికా విధించిన సుంకాలు 145 శాతానికి చేరాయి. పెంచిన టారిఫ్ లు నేటి నుంచి అమల్లోకి రానున్నాయని వైట్ హౌజ్ ప్రతినిధులు తెలిపారు.
ట్రంప్ విధించిన సుంకాల 145 శాతం సుంకాల వల్ల దాదాపు 450 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై ప్రభావం పడనుంది. ఇక చైనా విధించిన 84 శాతం టారిఫ్ ల కారణంగా 143 బిలియన్ డాలర్ల అమెరికా ఉత్పత్తులపై ప్రభావం పడనుంది. దీంతో అమెరికా విధించిన సుంకాలపై ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. 75 దేశాలకు విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. కానీ చైనాకు మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. దీంతో ట్రంప్ చైనాను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అసలు చైనా అంటే ట్రంప్ కు ఎందుకు అంత కోపం..? అసలు చైనా, అమెరికాల బలబలాలు ఏంటి..?
అమెరికా, చైనాల ట్రేడ్ వార్ పీక్స్ కు చేరింది. టారిఫ్ ల విషయంలో ఇరు దేశాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. నువ్ ఎంత విధిస్తే.. నేను అంత విధిస్తా అంటూ అమెరికా చైనా కాలు దువ్వుతున్నాయి. ఈనెల 2న చైనాపై అమెరికా 34శాతం సుంకాలు విధించింది. దీనికి కౌంటర్ గా అగ్రరాజ్యంపై చైనా సైతం 34శాతం సుంకాలు విధించింది. అయితే చైనా ప్రకటించిన 34శాతం సుంకాలను ఉపసంహరించుకోకపోతే అదనంగా 50శాతం టారిఫ్ లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.దాంతో పాటు చైనాతో అన్ని చర్చలు రద్దు చేస్తామని ప్రకటించారు. దీంతో తాము సైతం ప్రతీకార సుంకాలను ప్రకటిస్తామని చైనా రియాక్ట్ అయింది. ప్రతీకారంగా అమెరికా వస్తువులపై 84 శాతం సుంకాలు విధించింది. దీంతో ట్రంప్ కు కోపం ముంచుకొచ్చింది. సుంకాలను భారీగా పెంచేశారు.
చైనాపై 104 శాతం ఉన్న సుంకాలను 125 శాతం పెంచేశారు. తాజాగా మరోసారి చైనాపై సుంకాలను 145శాతానికి పెంచి బస్తీ మే సవాల్ అంటూ ట్రంప్ కాలు దువ్వుతున్నారు. మరోవైపు చైనాపై అమెరికా విధించిన సుంకాల కారణంగా ప్రపంచ దేశాలకు సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరు దేశాల మధ్య వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా అంటే ట్రంప్ కు ఎందుకు అంత కోపం..?

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం అమెరికా నెం. 1 దేశంగా ఉంది. చైనా నెం.2 దేశంగా ఉంది. చైనా నుంచి ఏటా రూ.38 లక్షల కోట్ల విలువైన వస్తువులు ఎగుమతి అవుతుంటాయి. గత మార్చి వరకు చైనాపై అమెరికా 10శాతం సుంకం విధించింది. ప్రస్తుతం ఆ సుంకం 145 శాతానికి చేరుకుంది. ట్రంప్ చైనాను టార్గెట్ చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆర్థిక, రాజకీయ, జాతీయ భద్రత ఇలా చాలా ముడి పడి ఉన్నాయి.
అమెరికా, చైనా ఎగుమతులు ఓసారి పరిశీలిస్తే.. దాదాపు 3.42 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులతో చైనా దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది. అయితే ఇందులో ఎక్కువ మొత్తంలో అమెరికాకే ఎగుమతి అవుతున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఎగుమతుల విలువ దాదాపు $1.71 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతుల్లో చైనా తొలి స్థానంలో ఉండగా.. అమెరికా రెండో స్థానంలో కొనసాగుతోంది.
వాణిజ్య లోటే కారణమా..?
2024 ఆర్థిక సంవత్సరంలో చైనా, అమెరికా వాణిజ్యం విలువ సుమారు 582.4 బిలియన్ల అమెరికా డాలర్లని అంచనా. 2024లో చైనాకు అమెరికా వస్తువుల ఎగుమతులు 143.5 బిలియన్ల డాలర్లు కాగా.. చైనా నుంచి దిగుమతులు మొత్తం 438.9 బిలియన్ డాలర్లు. అంటే.. చైనాతో పోల్చితే అమెరికా వాణిజ్య లోటు 295.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ లోటును అధిగమించడానికే ట్రంప్ చైనాపై తాజా సుంకాలు విధించినట్లు తెలుస్తోంది.
చైనా ఆర్థిక వ్యవస్థ.. అమెరికా ఆర్థిక వ్యవస్థలను పరిశీలిస్తే.. 2024లో అమెరికా జీడీపీ 29.2 ట్రిలియన్ డాలర్లు కాగా చైనా జీడీపీ సుమారు 19 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. అయితే.. కొనుగోలు సామర్థ్యం పరంగా చూస్తే చైనా ఆర్థిక వ్యవస్థ పెద్దది. దాదాపు 39.44 ట్రిలియన్ డాలర్లని అంచనా. చైనా తలసరి ఆదాయం 13,445 డాలర్లు కాగా.. అమెరికా తలసరి ఆదాయం 86,000 డాలర్లుగా ఉంది. రెండు దేశాల్లో నిరుద్యోగం పరిశీలిస్తే.. అమెరికాలో దాదాపు 4శాతం, చైనాలో దాదాపు 5శాతంగా ఉంది.
చైనా వస్తువులపై అధిక టారిఫ్ ల కారణంగా అమెరికన్ వ్యాపారాలు, వినియోగదారులపై భారం పడుతుంది. ఇది అమెరికాలో ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుంది. చైనా దిగుమతులపై ఆధారపడే అమెరికా కంపెనీల పోటీతత్వాన్ని తగ్గిస్తుంది. చైనా ప్రతీకార సుంకాలు అమెరికా ఎగుమతిదారులకు.. ముఖ్యంగా వ్యవసాయ రంగంపై పెను భారం కలిగిస్తాయి. ఇక అమెరికా సుంకాలు చైనా వస్తువులకు ప్రపంచ మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను తగ్గిస్తాయి. తయారీ రంగం, ఆర్థిక ప్రగతిని దెబ్బతీస్తుంది. వాణిజ్య యుద్ధం చైనా వ్యాపారాలకు అనిశ్చితిని కూడా సృష్టిస్తుంది. సప్లయ్ ఛైన్ వ్యవస్థ సర్దుబాట్లకు దారితీయవచ్చు.
-
షాకింగ్ వీడియో: అమెరికా F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్ -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
తోకముడిచిన ట్రంప్, అమెరికా పరువు తీసిన ఇరాన్ రియాక్షన్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
Iran: ట్రంప్ అల్టిమేటం వేళ హార్ముజ్ పై ఇరాన్ కీలక నిర్ణయం-ఆ కండిషన్ తో ..! -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు












Click it and Unblock the Notifications