డొనాల్డ్ ట్రంప్ కు మరో షాక్.. ? హార్వర్డ్ వర్శిటీపై దూకుడుకు బ్రేక్..!
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక వలసదారులతో పాటు విదేశీ విద్యార్దులపై దూకుడు ప్రదర్శిస్తున్న డొనాల్డ్ ట్రంప్ కు ఇవాళ మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా విదేశీ విద్యార్ధులకు స్వర్గధామంగా భావించే హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలకు ఇవాళ స్థానిక కోర్టు బ్రేక్ వేసింది. ఈ మేరకు ఫెడరల్ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
హార్వర్డ్ యూనివర్శిటీలోకి విదేశీ విద్యార్ధులు చేరకుండా చేసేందుకు ట్రంప్ సర్కార్ విధించిన ఆంక్షల్ని సవాల్ చేస్తూ వర్శిటీ కోర్టును ఆశ్రయించింది. ట్రంప్ సర్కార్ ఆంక్షల్ని కోర్టులో సవాలు చేసింది. దీనిపై విచారణ జరిపిన స్థానిక ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి వాటిని తాత్కాలికంగా పక్కనబెట్టాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ట్రంప్ సర్కార్ తో హార్వర్డ్ వర్సిటీ సాగిస్తున్న న్యాయపోరాటంలో గొప్ప ఊరట దక్కినట్లు భావిస్తున్నారు.

ట్రంప్ సర్కార్ ఆదేశాలు అమల్లోకి వస్తే హార్వర్డ్ యూనివర్శిటీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీంతో సదరు ఉత్తర్వులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. హార్డర్డ్ విశ్వవిద్యాలయం విదేశీ విద్యార్థుల నమోదును నిలిపివేయాలని ట్రంప్ సర్కార్ ఇచ్చిన ఆదేశాన్ని సవాలు చేస్తూ మే 23న ఇచ్చిన ఉత్తర్వుల్ని హార్డర్డ్ సవరించింది. ఇప్పుడు కోర్టు ఉత్తర్వు కూడా హార్డర్డ్ కు అనుకూలంగా రావడంతో ట్రంప్ సర్కార్ ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
-
ఖమేనీ సంధి ఒప్పందం? -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
షాకింగ్ వీడియో: అమెరికా F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్ -
Iran: ట్రంప్ అల్టిమేటం వేళ హార్ముజ్ పై ఇరాన్ కీలక నిర్ణయం-ఆ కండిషన్ తో ..! -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్












Click it and Unblock the Notifications