ఐసిస్ పై అమెరికా ప్రతాపం.. అతిపెద్ద బాంబు ప్రయోగం.. ట్రంప్ పై ప్రశంసల జల్లు
అగ్రరాజ్యం అమెరికా తన ప్రతాపం చూపించింది. ఆఫ్ఘనిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై గురువారం అతిపెద్ద బాంబును ప్రయోగించింది.
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా తన ప్రతాపం చూపించింది. ఆఫ్ఘనిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై గురువారం అతిపెద్ద బాంబును ప్రయోగించింది. ఈ బాంబును 'మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్(ఎంఓఏబీ)గా పిలుస్తారు.
ఆఫ్ఘనిస్తాన్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తలదాచుకున్న సొరంగాలు లక్ష్యంగా ఈ దాడి జరిగింది. స్థానిక కాలమాన ప్రకారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ నంగర్ హర్ రాష్ట్రం లోని అచిన్ ప్రాంతంపై ఈ బాంబును ప్రయోగించారు.

బాంబు బరువు.. 9,720 కిలోలు
అక్కడి ఖొరాసన్ సొరంగంపై 9.720 కిలోల బరువు ఉండే ఈ బాంబును అమెరికా యుద్ధ విమానం ఎంసీ-130 జారవిడిచింది. జీబీయూ-43బీ పేరు కలిగిన ఈ అతిపెద్ద బాంబును యుద్ధ క్షేత్రంలో అమెరికా ప్రయోగించడం ఇదే తొలిసారని పెంటగాన్ ప్రతినిధి ఆడమ్ స్టంప్ తెలిపారు.

2003 లోనే తయారు చేసినా...
నిజానికి ఎంఓఏబీ అంటే.. ‘మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్' అని అర్థం. 2003లో ఇరాక్ తో అమెరికా యుద్ధం చేసిన సమయంలో ఈ బాంబును తయారు చేసినా ఇప్పటి వరకు దీన్ని వినియోగించలేదు. అమెరికా ఈ బాంబును తయారు చేసిన కొద్ది కాలానికే రష్యా దీనికంటే శక్తివంతమైన ‘ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్'(ఎఫ్ఓఏబీ)ని తయారు చేసింది.

అన్ని జాగ్రత్తలు తీసుకునే...
ఆఫ్ఘనిస్తాన్ పై గురువారం రాత్రి అమెరికా ఈ బాంబును ప్రయోగించే సమయంలో సాధారణ ప్రజానీకానికి ఎలాంటి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వైట్ హౌస్ మీడియా కార్యదర్శి సీన్ స్పైసర్ చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ఓడించేందుకు కొనసాగుతున్న దాడుల్లో భాగంగానే ఈ బాంబును ప్రయోగించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారులు వెల్లడించారు.

శభాష్.. ట్రంప్
ఆఫ్ఘనిస్తాన్ పై అతి పెద్ద బాంబును ప్రయోగించి ఐఎస్ఐఎస్ స్థావరాలను నాశనం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఆ దేశ నేతలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పలువురు నేతలు మాట్లాడుతూ.. ఈ దాడితో ఉగ్రవాదులకు స్పష్టమైన సందేశం ఇచ్చినట్టు అయిందని అన్నారు.

ఇదీ అమెరికా పట్టుదల.. శక్తి
ఆఫ్ఘనిస్తాన్ తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఐసిస్, ఇతర ఉగ్రవాద సంస్థలను నాశనం చేసేందుకు అమెరికా ఎంత పట్టుదలతో ఉంది అన్న విషయం ఈ దాడితో అర్థమవుతోందని సెనేటర్ జిమ్ ఇన్ హోఫే తెలిపారు. ఉగ్రవాద నిర్మూలనకు ట్రంప్ కట్టుబడి ఉన్నారని కొనియాడారు. ఇదే సమయంలో అమెరికా సైన్యంపై కూడా ఆయన ప్రశంసలు కురిపించారు.
-
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications