అంతరిక్షం నుంచి ఓటు వేయడం అంటే మాటలా?
Sunita Williams: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి రేసు ఆరంభమైంది. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. పలు రాష్ట్రాల్లో పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది.
100 మిలియన్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన వారిలో రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ ఉన్నారు. ఓహియో సిన్సినాటిలో గల సెయింట్ ఆంథొని పడువా మారొనైట్ క్యాథలిక్ చర్చిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
ఈ ఎన్నికల్లో హోరాహోరి పోరు నెలకొంది. న్యూ హ్యాంప్‌షైర్ స్టేట్‌లోని డిక్స్ విల్లే నాచ్‌లో పడిన ఆరు ఓట్లల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్‌కు చెరిసగం ఓట్లు పోల్ అయ్యాయి. ఇద్దరికీ మూడు చొప్పున ఓట్లు పడ్డాయి. పోలింగ్ ముగిసే కొద్దీ ఫలితాలు వెల్లడవుతుంటాయి.

ఈ ఎన్నికల్లో ఓ వినూత్న ప్రక్రియకు తెర లేచింది. అంతరిక్షం నుంచి నాసా ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎర్లీ బ్యాలెట్ పేపర్లను విజయవంతంగా గ్రౌండ్ స్టేషన్‌కు పంపించగలిగారు. టెక్సాస్‌లోని హ్యారిస్ కౌంటీ క్లర్క్ ఆఫ్ కోర్ట్ ఆఫీస్‌కు వాటిని చేరవేశారు.
అంతరిక్షం నుంచి ఓటు వేసిన వారిలో సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్, డాన్ పెటిట్ ఉన్నారు. దీనికి నిదర్శనంగా ప్రౌడ్ టు బి అమెరికన్ అని రాసివున్న సాక్స్‌ను అంతరిక్ష కేంద్రం నుంచి ప్రదర్శించారు. పోలింగ్‌ను పురస్కరించుకుని అమెరికన్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అంతరిక్ష కేంద్రంలో ఉండే వ్యోమగాములు కూడా ఓటు వేసేలా 1997లో అమెరికా ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు అప్పట్లో టెక్సాస్ లెజిస్లేచర్ ఓ బిల్లును ఆమోదించింది. ఇప్పటివరకు ఇద్దరు వ్యోమగాములు మాత్రమే ఐఎస్ఎస్ నుంచి ఓటు వేశారు. 1997లో నాసా ఆస్ట్రోనాట్ డేవిడ్ వోల్ఫ్, 2019లో కేట్ రూబిన్స్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్, డాన్ పెటిట్ చేరారు.
ఈ ఏడాది జూన్‌లో సునీతా విలియమ్స్ బ్యారీ బుచ్ విల్మోర్‌ను అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి పంపించింది నాసా. అక్కడ తలెత్తిన కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులను సరిచేయడానికి స్టార్ లైనర్ స్పేస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అక్కడికి పంపింది. తిరిగి రావడం మాత్రం సాధ్యపడట్లేదు. అక్కడే చిక్కుకుపోయారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమ్మీదికి రానున్నారు.
-
ఖమేనీ సంధి ఒప్పందం? -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications