డోనాల్డ్ ట్రంప్ vs కమలా హ్యారిస్: పెన్సిల్వేనియాలో హోరా హోరీ..డిసైడింగ్ ఫ్యాక్టర్..?
అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో రిపబ్లిక్ పార్టీ ముందంజలో ఉండగా మొత్తానికి పోరు హోరాహోరీగా మారింది.ఇక పెన్సిల్వేనియాలో పరిస్థితి నువ్వా నేనా అన్నట్లుగా మారింది. ఎర్లీ ట్రెండ్స్ గమనిస్తే పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ కమలా హ్యారిస్ పై పైచేయి సాధించారు. స్వల్ప మెజార్టీతో అక్కడ రిపబ్లిక్ పార్టీ డెమొక్రటిక్ పార్టీపై కొనసాగుతోంది.
ఇక పెన్సిల్వేనియా ఇరు పార్టీ అభ్యర్థులకు చాలా కీలకమైన రాష్ట్రంగా మారింది.స్వింగ్ స్టేట్స్‌లో ఇదొక కీలకమైన రాష్ట్రంగా చెప్పొచ్చు. అమెరికా రాజకీయాల్లో పెన్సిల్వేనియాది ప్రత్యేక స్థానంగా అభివర్ణిస్తారు.వైట్ హౌజ్‌లో అడుగుపెట్టే అభ్యర్థికి ఈ రాష్ట్రంలో గెలుపు చాలా ముఖ్యమైనది.2016లో ట్రంప్ ఎలాగైతే ప్రచారం నిర్వహించి విజయం సాధించారో... ఆ వ్యూహమే పెన్సిల్వేనియాలో కూడా ఇంప్లిమెంట్ చేశారు. అయితే 2020లో జో బైడెన్ వేసిన పునాదిని పటిష్టం చేసేందుకు ఈ సారి కమలా హారిస్ శాయశక్తులా కృషి చేశారు.

ఇప్పటి వరకు 90శాతంకు పైగా బ్యాలెట్లను లెక్కించగా.. కమలా హారిస్ పై ట్రంప్ మెజార్టీతో కొనసాగుతున్నారు.ట్రంప్ 51.2శాతం ఓట్లు దక్కించుకోగా డెమొక్రటిక్ అభ్యర్థి హారిస్ 47.8శాతం ఓట్లు వచ్చాయి.ఇద్దరి మధ్య ఓట్ల తేడా 1.9 లక్షలుగా ఉంది.













Click it and Unblock the Notifications