అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నిక కాలేని డొనాల్డ్ ట్రంప్: ఆ దురదృష్టవంతుల జాబితా ఇదే

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యక్షుడెవరో తేలిపోయింది. రిపబ్లికన్ పార్టీ, డెమొక్రాట్ల మధ్య మూడు రోజుల పాటు తీవ్ర ఉత్కంఠతకు గురి చేసిన ఈ ఎన్నికల్లో విజయం ఎవరిదో స్పష్టమైంది. అమెరికన్లు డెమొక్రాట్లకు పట్టం కట్టారు. ఆ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ను ఎన్నుకున్నారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ ఎన్నికయ్యారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఇంకా ఒకట్రెండు రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతున్నప్పటికీ.. 270కి పైగా ఎలక్టోరల్ ఓట్లను జో బిడెన్ సాధించడంతో ఆయన గెలిచినట్లు వెల్లడించారు.

వరుసగా రెండోసారి గెలవలేక..

వరుసగా రెండోసారి గెలవలేక..

అమెరికా వంటి అగ్రరాజ్యానికి అధినాయకత్వాన్ని వహించడం అంటే గొప్ప విషయం. వరుసగా రెండోసారి అగ్రదేశం పీఠాన్ని అధిష్టించే అవకాశాన్ని డొనాల్డ్ ట్రంప్ కోల్పోయారు. 214 ఎలక్టోరల్ ఓట్ల వద్దే ఆయన నిలబడి పోయారు. పెన్సిల్వేనియాలో మెజారిటీ ఓట్లను సాధించడంతో జో బిడెన్‌ అధ్యక్ష పీఠానికి దగ్గర అయ్యారు. ఫాక్స్ న్యూస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జో బిడెన్‌కు మొత్తం 290 ఎలక్టోరల్ ఓట్లు పోల్ అయ్యాయి. డొనాల్డ్ ట్రంప్‌కు 214 మాత్రమే పడ్డాయి. జార్జియా, నార్త్ కరోలినా, అలస్కాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించినప్పటికీ.. 270 మార్క్‌ను అందుకోలేరు.

ఆరో అధ్యక్షుడిగా..

ఆరో అధ్యక్షుడిగా..

వరుసగా రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని అందుకోలేకపోయిన నేతల జాబితాలో డొనాల్డ్ ట్రంప్ నంబర్ 6. ఇప్పటిదాకా అయిదుమంది అధ్యక్షులు వరుసగా రెండోసారి విజయాన్ని సాధించలేకపోయారు. డొనాల్డ్ ట్రంప్.. తాజాగా ఆ జాబితాలో చేరారు. వరుసగా రెండోసారి అధ్యక్ష పదవిని అందుకోలేకపోవడం 1993 తరువాత ఇదే తొలిసారి. చివరిసారిగా జార్జ్ డబ్ల్యూ బుష్ సీనియర్.. ఒక టర్మ్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత మళ్లీ డొనాల్డ్ ట్రంప్ వంతు వచ్చింది.

విలియం హోవర్డ్ టాఫ్ట్‌తో ఆరంభం..

విలియం హోవర్డ్ టాఫ్ట్‌తో ఆరంభం..

వరుసగా రెండోసారి అధ్యక్ష పదవిని అందుకోలేకపోయే సంస్కృతి 1910లో ఆరంభమైంది. అప్పటి అధ్యక్షుడు విలియం హోవర్డ్ టాఫ్ట్.. తొలిసారిగా రెండోసారి ఎన్నిక కాలేకపోయారు. అమెరికాకు 27వ అధ్యక్షుడాయన. 1908లో అధ్యక్షుడిగా గెలుపొందారు. 1912 ఎన్నికల్లో ఓడిపోయారు. వుడ్రో విల్సన్ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. 1933లో హెర్బర్ట్ హూవర్ తన అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ ఆయనపై విజయం సాధించారు.

1976లో గెరాల్డ్ ఫోర్డ్..

1976లో గెరాల్డ్ ఫోర్డ్..

1976లో అప్పటి అధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్.. రెండోసారి గెలుపొందలేకపోయారు. జిమ్మీ కార్టర్ చేతిలో ఆయన ఓడిపోయారు. అదే సంస్కృతి కొనసాగింది. జిమ్మీ కార్టర్ కూడా రెండోసారి విజయం సాధించలేకపోయారు. 1977 నుంచి 1981 వరకు ఆయన అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. 1981 నాటి ఎన్నికల్లో ఓడిపోయారు. మళ్లీ అదే పరిస్థితి 1993లో ఏర్పడింది. అప్పటి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ సీనియర్.. రెండోసారి గెలవలేకపోయారు. 41వ అధ్యక్షుడిగా పనిచేశారు. 1989 నుంచి 1993 వరకు సీనియర్ బుష్ అమెరికాకు సారథ్యాన్ని వహించారు. గల్ప్ వార్ చోటు చేసుకుంది ఆయన హయాంలోనే. ఆయన కుమారుడు జార్జ్ బుష్.. మళ్లీ అమెరికా పీఠాన్ని అధిరోహించారు. ఆ తరువాత వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకోలేకపోయారు డొనాల్డ్ ట్రంప్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+