జార్జియాలో కొనసాగుతోన్న రీ కౌంటింగ్, మరో 4 గంటల్లో తేలనున్న ఫలితం..
అమెరికా అధ్యక్ష ఓట్ల లెక్కింపు ముగింపు దశకు చేరుకున్నది. మరో నాలుగు గంటల్లో ప్రక్రియ ముగిసే అవకాశం ఉన్నది. గత ఐదురోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడనున్నది. అయితే జార్జియాలో నువ్వా నేనా అన్నట్టు ట్రంప్-బిడెన్ మధ్య పోటీ ఉన్నది. దీంతో అక్కడ రీ కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. మరో 4 నుంచి 5 గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ క్లోజ్ అయ్యే అవకాశం ఉన్నది.

4 వేల 169 ఓట్లు లెక్కించామని జార్జియా సెక్రటరీ బ్రాడ్ తెలిపారు. మరో 8 వేల మిలిటరీ బ్యాలెట్ ఓట్లను లెక్కించాల్సి ఉందని వివరించారు. జార్జియాలో బిడెన్ 1096 ఓట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు. విస్కాన్సిన్, మిచిగాన్‌లో బిడెన్‌కు మంచి పట్టు సాధించారు. జార్జియా, పెన్సిల్వేనియాలో కూడా ఓట్లు రావడంతో.. ఆయన విజయం ఖాయమవుతోంది. పెన్సిల్వేనియాలో 6 వేల ఓట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు కౌంట్ చేయని చాలా కౌంటీలో బిడెన్ లీడ్‌లో ఉంటారని అంచనాలు నెలకొన్నాయి.
అయితే ట్రంప్ మద్దతుదారుల మాత్రం జార్జియా, పెన్సిల్వేనియా, నెవాడ, అరిజోనాలలో బ్యాలెట్ గురించి అనుమానం వ్యక్తంచేశారు. ఇదే కాదు బ్యాలెట్ ఓట్ల గురించి తొలి నుంచి ట్రంప్ అనుమానం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మద్దతుదారులకు ఏకంగా ఈ మెయిల్ చేశారు. ఇదీ అధికారికంగా రికార్డుల్లో ఉండనుంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications