వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

US election results .. ఫ్లోరిడాలో తలక్రిందులైన అంచనాలు .. జార్జియా, ఒహైయోలోనూ ట్రంప్ ముందంజ

|
Google Oneindia TeluguNews

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో జో బైడెన్ ముందంజలో కొనసాగుతున్నారు. అయితే కీలక రాష్ట్రాలలో మాత్రం టఫ్ ఫైట్ నడుస్తుంది. అధ్యక్ష పీఠానికి దగ్గరగా చేసేవిగా భావిస్తున్న రాష్ట్రాలలో ఒకటైన ఫ్లోరిడాలో డోనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవాలంటే ఫ్లోరిడాలో గెలిచి తీరాల్సిందే అన్న వాదన ఉంది. ఫ్లోరిడాలో నిర్వహించిన ముందస్తు ప్రీ పోల్ సర్వేలు కూడా జో బైడెన్ వైపే ప్రజా తీర్పు ఉండబోతుందని చెప్పాయి.

US elections 2020: ఎన్నికల సమయంలో ట్రంప్ కు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు .. తీర్పుపై ట్రంప్ అసహనంUS elections 2020: ఎన్నికల సమయంలో ట్రంప్ కు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు .. తీర్పుపై ట్రంప్ అసహనం

 ఫ్లోరిడాలో ట్రంప్ ముందంజ

ఫ్లోరిడాలో ట్రంప్ ముందంజ

ఫ్లోరిడాలో అంచనాలను తలకిందులు చేస్తూ ట్రంప్ ముందంజలో ఉండగా జో బైడెన్ వెనక పడ్డారు. తొలుత స్వల్ప ఆధిక్యంతో ముందంజలో ఉండటం క్రమంగా తేడాను పెంచుతూ వచ్చారు. ఫ్లోరిడాలో ట్రంప్ విజయం చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తుంది.

ఇక ఫ్లోరిడా ఓట్ల లెక్క విషయానికి వస్తే ట్రంపు అనుకూలంగా 51.2 శాతం ఓట్లు పోలయ్యాయి మొత్తం 55, 44, 563 ఓట్లు ఇప్పటివరకూ డొనాల్డ్ ట్రంప్ కు పోల్ అయినట్లుగా తెలుస్తుంది.

 వెనకబడిన జో బైడెన్ ,జార్జియాలోనూ ట్రంప్ దూకుడు

వెనకబడిన జో బైడెన్ ,జార్జియాలోనూ ట్రంప్ దూకుడు

జో బైడెన్ మాత్రం 47.9 శాతం ఓట్లతో వెనుకబడ్డారు. ఇప్పటివరకూ జో బైడెన్ కు 51 ,81 , 364 ఓట్లు పోలయ్యాయి. అంటే దాదాపుగా నాలుగు లక్షల పైచిలుకు ఓట్లతో తేడాతో ట్రంప్ బైడెన్ ను ఫ్లోరిడాలో వెనక్కి నెట్టారు. జార్జియాలోనూ ట్రంప్ ముందంజలో ఉన్నారు.ఇప్పటి వరకు 2,180,583 ఓట్లు , మొత్త 53.0% ఓట్లు ట్రంప్ కు పోలయ్యాయి. ఇక డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ కు 1,887,883 ఓట్లు , 45.7% మాత్రమే ఇప్పటివరకు ఓట్లు పోల్ అయినట్టు తెలుస్తుంది. ఇక్కడ కూడా ట్రంప్ , జో బైడెన్ ను వెనక్కు నెట్టి ముందంజలో ఉన్నారు .

ఒహైయో లో కూడా ట్రంప్ ముందంజ

ఒహైయో లో కూడా ట్రంప్ ముందంజ

ఇక మరో కీలక రాష్ట్రమైన ఒహైయో లో కూడా ట్రంప్ ముందంజలో ఉన్నారు. ట్రంప్ కు ఒహైయోలో 53.5% ఓట్లు పోలయ్యాయి . మొత్తం 30,08,559 ఓట్లు ట్రంప్ కు పోలయ్యాయి . ఇక జో బైడెన్ కి 45.1%
మాత్రమే పోల్ అయ్యాయి . మొత్తం 25,36,518ఓట్లు జో బైడెన్ కు వచ్చాయి . ఇక్కడ జో బైడెన్ బాగా వెనకబడ్డారు. ట్రంప్ మాత్రం విజయం సాధించే దిశగా దూసుకుపోతున్నారు . కీలక రాష్ట్రాలలో ట్రంప్ చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నారు.

అధ్యక్ష పీఠం కోసం కీలక రాష్ట్రాల్లో హోరాహోరీగా

అధ్యక్ష పీఠం కోసం కీలక రాష్ట్రాల్లో హోరాహోరీగా

ఇప్పటికే ట్రంపు బృందం ఫ్లోరిడాలో తాము విజయం సాధించినట్లుగా చెప్పుకుంటుంది. ఇక్కడ ఒక చోట మాత్రమే కాకుండా కీలక రాష్ట్రాలైన టెక్సాస్, జార్జియా, ఒహైయో లోను ట్రంప్ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇప్పటివరకు 223 ఎలక్టోరల్ కాలేజి ఓట్లతో జో బైడెన్ ముందంజలో ఉండగా డోనాల్డ్ ట్రంప్ 118 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లతో వెనుకబడ్డారు. క్యాలిఫోర్నియా, ఒరెగాన్ ,వాషింగ్టన్, ఇదాహో లలో ఇప్పటికే కౌంటింగ్ పూర్తయింది .

English summary
Joe Biden fell behind while Trump was in the lead, upsetting expectations in Florida. Being in the lead with a slight lead at first has gradually increased the difference. Trump looks set to win in Florida. In terms of Florida votes, Trump received 51.2 percent of the vote, with 55, 44, 563 votes so far, that Donald Trump is in the lead. In Georgia, and ohio too, Trump is leading.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X