మరో గుర్తు తెలియని వస్తువును కూల్చేసిన యూఎస్ ఫైటర్ జెట్: రెండురోజుల్లో రెండోసారి!!
మరో గుర్తు తెలియని వస్తువును అలస్కా వద్ద యూఎస్ ఫైటర్ జెట్ కూల్చేసింది. రెండురోజుల్లో రెండోసారి ఈ కూల్చివేత జరిగింది.
యూఎస్ ఫైటర్ జెట్ తాజాగా కెనడా కెనడా మీదుగా సంచరిస్తున్న ఓ గుర్తు తెలియని వస్తువును కూల్చివేసింది. ఉత్తర అమెరికా కెనడా సంయుక్త ఆపరేషన్ లో 40 వేల అడుగుల ఎత్తులో అలస్కా మీదుగా సంచరిస్తున్న ఓ గుర్తు తెలియని వస్తువును, ఎలాంటి మానవ వనరులు లేకుండా సంచరించటాన్ని గుర్తించిన అమెరికా అధికారులు ఫైటర్ జెట్ సహకారంతో దానిని కూల్చివేశారు.
వారం రోజుల క్రితం చైనీస్ గూడచారి బెలూన్ ను కూల్చి వేసిన తర్వాత, ప్రస్తుతం జరిగిన కూల్చివేత రెండవది. ఇది రహస్యమైన గాలి చొరబట్ల శ్రేణిలో ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ వస్తువు కారణంగా కెనడియన్ మరియు యుఎస్ విమానాలు ప్రమాదం బారిన పడేవని, దానిని విజయవంతంగా కూల్చి వేయడం వల్ల ఆ ప్రమాదం తప్పిందని వైట్ హౌజ్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు.

యుకాన్ లోని కెనడియన్ దళాలు ఇప్పుడు వస్తువు యొక్క శిథిలాలను సేకరించి వాటిని విశ్లేషిస్తాయని జాన్ కిర్బీ వెల్లడించారు. దాని శిథిలాలు ఉత్తర అలస్కాలో ఘనీభవించిన నీటి ప్రాంతంలో పడ్డాయని వాటిని సేకరించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 40 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న వస్తువును కూల్చడానికి ముందు దానిని పరిశీలించడానికి ఒక మిలటరీ విమానాన్ని పంపించామని పేర్కొన్న ఆయన ఇక అందులో మనుషులు ఎవరూ లేరని పైలెట్ సమాచారం అందించడంతో తమకు అనుమానం వచ్చి కూల్చివేశామని జాన్ కిర్బీ వెల్లడించారు.
తాజా చొరబాటును ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇక కెనడా రక్షణ మంత్రి, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తో కూడా మాట్లాడినట్టు వెల్లడించారు. ఇక ఈ కూల్చివేతను ఉద్దేశించి కెనడా రక్షణ మంత్రి అనిత ఆనంద్ తన ట్వీట్లో మన సార్వభౌమాధికారాన్ని మనం ఎల్లప్పుడూ కలిసే కాపాడుకుంటామంటూ అమెరికాను కూడా ఉద్దేశించి ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications