అమెరికా: కోవిడ్ సంబంధ సమస్యలతో కన్నుమూసిన అమెరికా మాజీ విదేశాంగ మంత్రి కోలిన్ పావెల్-Newsreel

అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి కోలిన్ పావెల్ మరణించారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. పావెల్ వయసు 84 సంవత్సరాలు. గత కొద్దికాలంగా ఆయన కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు.
2001లో జార్జ్ డబ్ల్యూబుష్ ఆధ్వర్యంలోని రిపబ్లికన్ పార్టీ ప్రభుత్వంలో పావెల్ విదేశాంగ మంత్రిగా పని చేశారు.
గతంలో యూఎస్ మిలిటరీలో పని చేసిన ఆయన, విదేశాంగ మంత్రి బాధ్యతలు చేపట్టిన తొలి ఆఫ్రికన్-అమెరికన్‌గా రికార్డులకెక్కారు.
కొన్నాళ్లుగా కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న కోలిన్ పావెల్ వ్యాక్సీన్ పూర్తి డోసులు కూడా తీసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
పావెల్ మరణంపై స్పందించిన అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూబుష్ ''ఒక కుటుంబ సభ్యుడిని, మంచి స్నేహితుడిని కోల్పోయాను'' అంటూ స్పందించారు.
రెండుసార్లు ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ను అందుకున్న ఘనత పావెల్ కే దక్కిందని బుష్ వ్యాఖ్యానించారు.
అప్పట్లో తనను తాను మోడరేట్ రిపబ్లికన్‌గా చెప్పుకున్న కోలిన్ పావెల్, 2008లో ఒబామాను అధ్యక్షుడిని చేయాలని కోరుతూ తన పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారు.
ఇరాక్ వార్‌కు సంపూర్ణ మద్ధతు ఇచ్చినప్పటికీ, ఈ యుద్ధం విషయంలో తాను తప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్టులను నమ్మానని, అది తన కెరీర్‌కు మాయని మచ్చగా మారిందని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ పావెల్ వ్యాఖ్యానించారు.
వియత్నాం యుద్ధంలో పాల్గొన్న పావెల్ అందులో గాయపడ్డారు. ఆ యుద్ధం తర్వాత ఆయన రాజకీయ, మిలటరీ వ్యూహకర్తగా అనుభవం సంపాదించారని చెబుతారు. పలువురు రాజకీయ నేతలకు మిలిటరీ సలహాదారుగా పావెల్ పని చేశారు.
ఇవి కూడా చదవండి:
- లెస్బియన్ కవయిత్రి సాఫో: మగవాళ్లు చూడని కొత్త ప్రపంచాన్ని చూపించిన ప్రేమిక
- పిల్లలకిచ్చే కోవిడ్ వ్యాక్సీన్ల గురించి మనకేమి తెలుసు?
- విజయనగరం సిరిమానోత్సవమంటే ఏంటి?
- లెస్బియన్ కవయిత్రి సాఫో: మగవాళ్లు చూడని కొత్త ప్రపంచాన్ని చూపించిన ప్రేమిక
- భారత్-పాక్ యుద్ధం 1971: చెరువులో నీటి అడుగున దాక్కొని ప్రాణాలు కాపాడుకున్న భారత సైనికుడి కథ
- బంగ్లాదేశ్: హిందూ ఆలయాలు, పూజా మండపాల మీద జరిగిన దాడులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
- బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపై భారత్‌కు షేక్ హసీనా హెచ్చరిక, ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)












Click it and Unblock the Notifications