30 రోజుల్లో వెళ్లిపోతే మీకే మంచిది.. లేదంటే అరెస్ట్, జరిమానా: ట్రంప్ హెచ్చరికలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో సంచలన నిర్ణయంతో అటు ప్రపంచ దేశాలను, ఇటు అగ్రరాజ్యంలోని విద్యార్థులు, వలసదారులను నిద్రపోకుండా చేస్తున్నారు. ఇప్పటికే అనేక దేశాలపై టారిఫ్ లు విధించి ఆ దేశాల్ని అతలాకుతలం చేశారు. తాజాగా మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ఉంటున్న ఫారినర్స్ కు భారీ షాక్ ఇచ్చింది ట్రంప్ ఆధ్వర్యంలోని యూఎస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్.

30 రోజులకు పైబడి ఉంటున్న వారు తక్షణమే దేశం వదిలి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది. లేని పక్షంలో జరిమానా విధించడం, అరెస్టు చేయడం జరుగుతుందని అక్కడి అధికారులు హెచ్చరించారు. 30 రోజులకు పైగా ఉన్నవారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని.. నమోదు చేసుకోని వారికి కఠిన శిక్షలు పడతాయని స్పష్టం చేసింది.

అమెరికాలో 30 రోజులకు పైగా ఉన్న విదేశీయులకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయిపోయింది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన ప్రకారం.. ఏప్రిల్ 11 తర్వాత అమెరికాకు వచ్చే విదేశీయులు 30 రోజుల్లోపు వేలిముద్రలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా చేయకపోతే నిబంధనల ప్రకారం అధికారులు ఆర్డర్ పాస్ చేశాక ఉంటే రోజుకు 998 డాలర్లు ఫైన్ విధించవచ్చు. ఆ తర్వాత కూడా వెళ్లకుంటే తర్వాతి రోజు నుంచి వేయి నుంచి 1500 యూఎస్ డాలర్ల జరిమానా విధించడం జరుగుతుంది. అయినా వెళ్లని పక్షంలో జైల్లో వేయడం జరుగుతుంది. అంతేకాకుండా నమోదు చేసుకోని విదేశీయులను అమెరికా నుండి కూడా బహిష్కరించే నిబంధన ఆ చట్టంలో ఉంది.

US Homeland Security Orders Individuals Over 30-Day Stay to Leave Immediately

ఈ మేరకు సొంతంగా అమెరికాను వీడిపోవడమే ఉత్తమమైన మార్గమని అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించింది. ఎలాంటి నేర నేపథ్యం లేకపోతే అమెరికాలో సంపాదించుకున్న సొమ్మును దాచుకుని వెళ్లాలని తెలిపింది. విమాన టికెట్ సొమ్మును భరించలేకపోతే రాయితీ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేస్తామని ఈ మేరకు అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ ద్వారా తెలిపింది.

అయితే ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం H-1 B లేదా స్టూడెంట్ పర్మిట్ వంటి వీసాలు ఉన్న ఉన్నవారిపై నేరుగా ప్రభావితం చేయదని నిపుణులు అంటున్నారు. కానీ విదేశీ పౌరులు సరైన అనుమతి లేకుండా యూఎస్‌లో ఉండకుండా చట్టాలను కఠినంగా అమలు చేయడాన్ని ఇది సూచిస్తుంది. అయితే తాజాగా తీసుకొచ్చిన నిర్ణయం ప్రకారం.. H-1 B వీసాపై ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోయి నిర్ణీత వ్యవధిలోపు దేశం విడిచి వెళ్లకపోతే చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+