భారత్, చైనాను చావుదెబ్బ కొట్టిన అమెరికా-రష్యాపై కోపంతో..!

అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా విషయంలో భారత్ ఎంత తటస్థ వైఖరి అవలంబిస్తున్నా అంతర్జాతీయంగా వారిద్దరి మధ్య సాగే పోరు ప్రభావం మాత్రం మనపై పడుతూనే ఉంది. తాజాగా రష్యా చమురు ఉత్పత్తిదారులు, నౌకలపై అమెరికా విధించిన భారీ ఆంక్షలు భారత్ తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపబోతున్నాయి. ఉక్రెయిన్ పై యుద్దం చేస్తున్న రష్యా దూకుడును అడ్డుకునేందుకు అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భారత్, చైనాలో చమురు ధరలు పెంచే అవకాశాలున్నాయి.

ఉక్రెయిన్ తో యుద్ధం ప్రారంభించి ఏడాది దాటిపోయినా ఫలితం రాబట్టుకోలేకపోవడం రష్యాకు శాపంగా మారింది. ముఖ్యంగా ఉక్రెయిన్ కు మద్దతిస్తున్న అమెరికా, నాటో దేశాల్ని ఎదిరించి ఈ యుద్ధం గెలవడం రష్యాకు అసాధ్యంగా కనిపిస్తోంది. అదే సమయంలో రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఆ దేశం చమురును ఎవరూ కొనకుండా గతంలో అమెరికా ఆంక్షలు విధించింది. అయితే భారత్ మాత్రం ఇవేవీ లెక్కచేయకుండా మిత్రదేశమైన రష్యా వద్ద రాయితీతో మరీ చమురు కొంటోంది.
చైనా పరిస్ధితి కూడా ఇదే. దీంతో అమెరికా ఈసారి గట్టిగా కొరడా ఝళిపించింది.

US imposes tougher sanctions to stop oil supply to india and china

రష్యా చమురు ఉత్పత్తి సంస్థలపై అమెరికా విధించిన ఆంక్షల కారణంగా ఇప్పుడు భారత్, చైనా వారి నుంచి చమురు కొనే పరిస్ధితి లేకుండా పోతోంది. దీంతో ఈ రెండు దేశాలు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, అమెరికాల నుండి మరింత చమురును కొనాల్సిన పరిస్ధితి. ఈ పరిణామం సహజంగానే చమురు ధరలు, సరుకు రవాణా ఖర్చులను పెంచుతాయి. దీంతో భారత్, చైనా అంతర్గతంగా చమురు ధరల పెంపుకు సిద్ధం కావాల్సిందే.

చమురు ద్వారా రష్యా సంపాదిస్తున్న ఆదాయాన్ని ఉక్రెయిన్ యుద్ధంలో ఖర్చుపెట్టకుండా అమెరికా ఆంక్షలతో అడ్డుకట్ట వేసింది. పాశ్చాత్య ఆంక్షలు, 2022లో గ్రూప్ ఆఫ్ సెవెన్ కంట్రీస్ విధించిన ధరల పరిమితి వల్ల భారత్, చైనాకు చమురు రవాణా చేయడానికి అనేక ట్యాంకర్లు వాడుకున్నారు. అలాగే రష్యా చమురు వాణిజ్యాన్ని యూరప్ నుండి ఆసియాకు మార్చింది. కొన్ని ట్యాంకర్లు ఇరాన్ నుండి చమురును కూడా రవాణా చేశాయి. ఇప్పుడు ఇవన్నీ ఆంక్షల పరిధిలోకి వచ్చేశాయి.

కొత్త ఆంక్షల వల్ల రష్యా చమురు ఎగుమతులు తీవ్రంగా దెబ్బతింటాయని, దీని వల్ల చైనా స్వతంత్ర రిఫైనర్లు రిఫైనింగ్ అవుట్‌ పుట్‌ను తగ్గించుకోవలసి వస్తుందని చైనా చెబుతోంది. అమెరికా ఆంక్షల వల్ల తక్కువ సమయంలో రష్యా నుండి ముడి చమురును సరఫరా చేయడానికి అందుబాటులో ఉన్న నౌకల లభ్యతను గణనీయంగా తగ్గిస్తాయి. సరుకు రవాణా ధరలను పెంచుతాయని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+