డొనాల్డ్ ట్రంప్ హిట్ లిస్ట్ లో 20 దేశాలు: భారత్, పాక్..?
ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తోన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. కొరడా ఝుళిపిస్తోన్నారు. ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు డొనాల్డ్ ట్రంప్.
ఈ పరిస్థితుల మధ్య అమెరికా విదేశాంగ శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 20కి పైగా దేశాలకు అత్యున్నత ప్రయాణ హెచ్చరికను జారీ చేసింది. వీటిని లెవల్ 4 కేటగిరీలో చేర్చింది. లెవెల్ 4 కేటగిరీలో చేర్చడం అంటే ఆయా దేశాలకు వెళ్లిన అమెరికన్ల ప్రాణాలకు గ్యారంటీ లేదని అర్థం. అత్యంత తీవ్రతర పరిస్థితుల్లో మాత్రమే ఈ లెవెల్ ట్రావెల్ అడ్వైజరీని జారీ చేస్తుంటుంది అమెరికా. తీవ్రమైన భద్రతాపరమైన ప్రమాదాలు, అమెరికా ప్రభుత్వం పౌరులకు సహాయం అందించే సామర్థ్యం పరిమితంగా ఉండటం ఉంటాయి ఇటువంటి సందర్భాల్లో.

క్రియాశీల సంఘర్షణలు, తీవ్రవాదం, విస్తృతమైన హింసాత్మక పరిస్థితులు, రాజకీయ అస్థిరత లేదా ప్రాథమిక సేవలు స్తంభించిపోయిన పరిస్థితులు ఉన్న దేశాలకు దీనిని వర్తింపజేస్తుంటుంది. ఈ దేశాలలో చాలా చోట్ల అమెరికా దౌత్య ఉనికి చాలా పరిమితంగా లేదా పూర్తిగా లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో కాన్సులర్ సహాయం అందించడం కష్టతరం లేదా అసాధ్యంగా మారుతుంది. ఈ సలహా కేవలం అంతర్జాతీయంగా ప్రయాణించాలనుకునే వారికే కాకుండా, ఇప్పటికే లెవల్ 4 దేశాలలో ఉన్న అమెరికన్ పౌరులకు కూడా వర్తిస్తుంది.
వారు సురక్షితంగా వీలైతే ఆయా దేశాల నుండి బయలుదేరాలని గట్టిగా సూచించినట్టయింది. అధికారికంగా ఎటువంటి తరలింపులు ఉండకపోవచ్చు. సంక్షోభ సమయంలో సహాయం అందుబాటులో కూడా ఉండదని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సాయుధ పోరాటం, తీవ్రవాదం, అధిక నేరాల రేటు, పౌర అశాంతి, కిడ్నాప్ బెదిరింపులు, అలాగే ఆరోగ్య సంరక్షణ, అత్యవసర సేవలపై పతనం లేదా తీవ్ర ఒత్తిడి వంటి అనేక ప్రమాద కారకాల ఆధారంగా విదేశాంగ శాఖ లెవల్ 4 హోదాను నిర్ణయిస్తుంది.
ప్రస్తుతం లెవల్ 4 కేటగిరీలో చేర్చిన దేశాల్లో..
ఆఫ్ఘనిస్తాన్
బెలారస్
బుర్కినా ఫాసో
బర్మా
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
హైతీ
ఇరాన్
ఇరాక్
లెబనాన్
లిబియా
మాలి
నైగర్
ఉత్తర కొరియా
రష్యా
సోమాలియా
దక్షిణ సూడాన్
సూడాన్
సిరియా
ఉక్రెయిన్
వెనిజులా
యెమెన్.. ఉన్నాయి.
-
ఇరాన్ యుద్ధం వేళ భారత్-అమెరికా భారీ డీల్! -
Trump vs Pope: ట్రంప్ కు పోప్ లియో ఘాటు కౌంటర్-ఇరాన్ వార్ పై మరో షాక్..! -
అమెరికా అన్నంత పనీ చేసిందీ.. ట్రంప్ చేతుల్లోకి హార్మూజ్ జలసంధి..? -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
ఎక్కడ కొట్టాలో అక్కడ దెబ్బకొడుతున్న డొనాల్డ్ ట్రంప్..: ఫస్ట్ ట్రిగ్గర్ -
ఇరాన్ నష్టం రోజుకు రూ. 4,000 కోట్లు పైమాటే -
అమెరికాలో ‘తెలుగు’ అందాలు: చిలకలూరిపేట చిన్నది Vs కరీంనగర్ క్వీన్ -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications