Deepavali day act: అమెరికాలో దీపావళి ‘సెలవు ’, చట్టసభలో బిల్లు

వాషింగ్టన్: భారతదేశంలోనేగాక ప్రపంచంలో నలుమూల ఉన్న భారతీయులు దీపావళి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. అమెరికాలోనూ భారతీయులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని చట్టసభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీపావళిని అమెరికాలోనూ సెలవు దినంగా ప్రకటించాలని ప్రతిపాదిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యురాలు కరోలిన్ బి మలోనే ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో బిల్లును ప్రవేశపెట్టారు.

'దీపావలి డే యాక్ట్' బిల్లును సభలో ప్రవేశపెట్టడం తనకెంతో సంతోషంగా ఉందని కరోలిన్ బి మనోనే వెల్లడించారు. చీకటిపై వెలుతురు, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండగను జరుపుకోవడం విశేషమని ఆమె వ్యాఖ్యానించారు. కరోనావైరస్ మహమ్మారిపై పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలోనూ ఈ పండగకు ప్రాధాన్యముందని తెలిపారు.

 US lawmakers to introduce bill to make Deepavali federal holiday.

దీపావళిని పెడరల్ ప్రభుత్వ సెలవు దినంగా అధికారికంగా ప్రకటించాలని కరోలిన్ బి మాలోనే కోరారు. భారతీయ అమెరికన్ రాజా కృష్ణమూర్తి సహా పలువురు యూఎస్ కాంగ్రెస్ సభ్యులు, విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ గ్రెగరీ మీక్స్ తదితరులు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. ప్రపంచానికి , ప్రజల జీవితాలకు వెలుగులు ప్రసాదించే దీపావళి పండగను ఫెడరల్ హాలీడేగా ప్రకటించడం ఎంతో సముచితంగా ఉంటుందని రాజా కష్ణమూర్తి అన్నారు. అమెరికాలో లక్షలాదిగా ఉన్న భారతీయులు దీపావళి పండగను మరింత ఘనంగా జరుపుకునే అవకాశం లభిస్తుందని ప్రవాసులు అభిప్రాయపడుతున్నారు.

Recommended Video

    Fuel Prices Drop : AP & TS ప్రభుత్వాలు వ్యాట్ తగ్గిస్తే ₹100 లోపుకు చమురు ధరలు!! || Oneindia Telugu

    ఇది ఇలావుండగా, భారతదేశంలో గురువారం దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. మార్కెట్లలో జనంతో సందడిగా మారాయి. బాణాసంచా భారీ ఎత్తును కొనుగోలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ దీపావళి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. నేటి సాయంత్రం లక్ష్మీపూ చేసి, దీపాలు వెలిగించి సంబరాలు చేసుకోనున్నారు. రుచికరమైన పిండివంటలు చేసుకున్నారు. గురువారం రాత్రి టపాసులు కాలుస్తూ సంబరాలు అంబరాన్ని తాకనున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+