ఉత్తరకొరియాపై దాడికి సిద్ధమైన అమెరికా? సైన్యాన్ని అప్రమత్తం చేసిన కిమ్ జాంగ్ ఉన్!

ఉత్తరకొరియా మళ్లీ అణ్వస్త పరీక్ష నిర్వహించబోతోందా? ఒకవేళ అదే జరిగితే, ఆ దేశంపై అమెరికా దాడి చేయడానికి సిద్ధంగా ఉందా? ఈ ప్రశ్నలకు మరికొన్ని గంటల్లోనే సమాధానం తెలియనుంది.

ఉత్తర కొరియాపై అమెరికా దాడికి పాల్పడబోతోందా? అమెరికా దాడిని ముందే పసిగట్టిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ తన దేశ సైన్యాన్ని అప్రమత్తం చేశారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.

వరుస క్షిపణి పరీక్షలతో ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్నారు ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్. ప్రపంచ అగ్ర దేశాలు, ఐక్యరాజ్యసమితి హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా తన పని తాను చేసుకుపోతున్నారు.

ఇప్పటికే ఐదు అణు పరీక్షలను నిర్వహించిన కిమ్ జాంగ్ ఆరో అణ్వస్త్ర పరీక్షకు సిద్ధమయ్యారంటూ వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. తన తాత, ఉత్తరకొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ ఇల్ సంగ్ 105వ జయంతి (ఏప్రిల్ 15) సందర్భంగా ఈ అణు ప్రయోగం నిర్వహించవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

US may launch strike if North Korea goes through with nuclear weapons test, it is claimed

జయంతి సందర్భంగా భారీ మిలిటరీ డ్రిల్ నిర్వహిస్తే పర్వాలేదని... అణ్వస్త్ర పరీక్ష నిర్వహిస్తే మాత్రం సిరియాపై దాడి చేసినట్టుగానే, ఉత్తరకొరియాపై దాడి చేసే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ సలహాదారు ఒకరు వెల్లడించిన నేపథ్యంలో ఇరు దేశాల నడుమ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఈ నేపథ్యంలో, ఉత్తరకొరియా అణ్వస్త పరీక్ష నిర్వహిస్తుందా? ఆ దేశంపై అమెరికా దాడి చేస్తుందా? అనే ప్రశ్నలకు మరికొన్ని గంటల్లోనే సమాధానం తెలియనుంది. మరోవైపు అమెరికాకు ఏ మాత్రం భయపడే ప్రసక్తే లేదని కిమ్ జాంగ్ కూడా ప్రకటించారు.

తాము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నామని పేర్కొన్న ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలంటూ తన సైన్యానికి కూడా ఆదేశాలు జారీ చేశానట్లు చెబుతున్నారు.

దీనికితోడు ఆయన మరో సంచలన వ్యాఖ్య చేశారు. భవిష్యత్తులో ఉత్తరకొరియా, దక్షిణకొరియా ఏకమవుతాయని... ఆ దేశానికి కూడా తానే అధ్యక్షుడిని అవుతానని ఆయన పేర్కొనడం చూస్తుంటే త్వరలోనే ఆయన దక్షిణ కొరియాపై దాడి చేయవచ్చనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+