రెండో ప్రపంచ యుద్ధం తరువాత: దిమ్మతిరిగేలా పెట్రో రేట్ల పతనం: రెండు డాలర్లకే బ్యారెల్
న్యూయార్క్: పలు దేశాలకు ఆర్థికంగా వెన్నెముకగా నిలిచిన చమురు ధరలు కుప్పకూలిపోయాయి. పేక మేడను తలపించాయి. దిమ్మ తిరిగేలా పడిపోయాయి. పెట్రో ఉత్పత్తుల రేట్లు ఈ స్థాయిలో దిగజారిపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇదివరకు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పెట్రో ఉత్పత్తుల రేట్లు కూడా ఇదే స్థాయి క్షీణించాయి. 1946లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్యారెల్ ధర 25.57 డాలర్లు పలికింది. ఈ సారి మరింత దిగజారింది.

305 శాతం క్షీణత నమోదు..
పెట్రో రేట్లలో 305 శాతం క్షీణత కనిపించింది. అమెరికన్ డాలర్‌తో పోల్చుకుంటే సగానికి పడిపోయాయి వాటి రేట్లు. రెండు డాలర్లకే ఒక బ్యారెల్ లభిస్తోంది. .రెండు డాలర్లకు ఒక బ్యారెల్ చమురు లభిస్తోందంటే.. వాటి పతనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీని ప్రభావం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థపై పడుతుందనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. అనేక దేశాలకు క్రూడాయిల్ ఉత్పత్తి ప్రధాన ఆదాయ వనరు కావడం వల్ల దుష్ప్రభావం వెంటాడుతుందని అంటున్నారు.

మైనస్‌లో వెళ్లిపోయిన రేట్
అమెరికాలో చమురు ట్రేడింగ్‌ను పర్యవేక్షించే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) తాజాగా లెక్కలను వెల్లడించింది. అమెరికాలో సోమవారం ముగిసిన ఆయిల్ ట్రేడింగ్ మైనస్‌లోకి వెళ్లిపోయింది. బ్యారెల్ ఒక్కింటికి మైనస్ 37.63 డాలర్ నమోదైంది. ఒక్కరోజే 55.90 డాలర్ల మేర పతనమైంది. క్రూడాయిల్ చరిత్రలో ఈ తరహాలో క్షీణత నమోదు కావడం ఇదే తొలిసారి. చమురు రేట్లలో 305.97 శాతం పతనం నమోదైందని వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ వెల్లడించింది.

కరోనా ప్రభావం వల్లే..
ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ తీవ్రత వల్ల పెట్రో రేట్లు పడిపోయాయని డబ్ల్యూటీఐ అంచనా వేసింది. దాదాపు అన్ని దేశాలు కూడా లాక్‌డౌన్‌ను ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోలు, డీజిల్ అమ్మకాలు అసాధారణ స్థితికి దిగజారాయి. సాధారణ పరిస్థితులతో పోల్చుకుంటే.. లాక్‌డౌన్ రోజుల్లో నమోదైన పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు కేవలం 10 నుంచి 15 శాతం. ప్రపంచవ్యాప్తంగా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి.

ఓవర్ ప్రొడక్షన్.. స్టోరేజ్ లిమిటేషన్స్..
లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ..చమురు వెలికితీత కార్యక్రమాలు యధాతథంగా కొనసాగాయని తెలుస్తోంది. ఫలితంగా- మార్కెట్ల ప్రాథమిక సూత్రం డిమాండ్ అండ్ సప్లయ్ తలకిందులైంది. డిమాండ్‌కు ఎన్నో రెట్లకు మించిన సప్లయ్ ఏర్పడింది. ఉత్పత్తి చేసిన క్రూడాయిల్‌ను నిల్వ ఉంచుకునే సామర్థ్యం పరిమితంగా ఉంది. దీనితో తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మకాలను కొనసాగించాల్సి వచ్చింది. రోజువారీ డిమాండ్ దాదాపుగా జీరో స్థాయికి చేరుకోవడం, అదే సమయంలో సరఫరా భారీగా ఉండటం వల్ల ఆటోమేటిక్‌గా వాటి రేట్ల పడిపోయాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Recommended Video
యునైటెడ్ స్టేట్స్ ఆయిల్ ఫండ్ అంచనా ప్రకారం..
యునైటెడ్ స్టేట్స్ ఆయిల్ ఫండ్ ఎల్‌పీ ఎన్‌వైఎస్ఈఏఆర్‌సీ- ఈటీఎఫ్, డబ్ల్యూటీఐ అంచనాల ప్రకారం.. కరోనా వైరస్ ప్రభావం తగ్గేంత వరకూ క్రూడాయిల్ ధరల్లో పెద్దగా మార్పులు కనిపించకపోవచ్చని తెలుస్తోంది. వారం రోజుల వ్యవధిలో చమురు అమ్మకాల ద్వారా గరిష్ఠంగా 552 డాలర్లు నమోదు కాగా.. కిందటి వారం ఈ రేటు 1.6 డాలర్లకే పరిమితమైంది. చమురు ఎగుమతుల్లో 13 శాతం మేర క్షీణత కనిపించిందని డబ్ల్యూటీఐ వెల్లడించింది.
-
గ్రీన్ టీ Vs బ్లాక్ టీ: రెండింటి లో ఏది మంచిది, పరిమితి..!! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications