Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎంతకాలం ఉంటానో తెలియదు అంటూనే ట్రంప్ వ్యంగ్యం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తాను ఎంతకాలం ఉంటానో తనకే తెలియదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఫ్లోరిడాలోని ఆయన నివాసం దగ్గర ఓ సాయుధుడులోనికి చొరబడడంతో భద్రతా బలగాలు అతడిని కాల్చి చంపారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఫ్లోరిడాలోని ట్రంప్ ఎస్టేట్ లో చొరబడిన సాయుధుడు

గత శనివారం అర్ధరాత్రి ఫ్లోరిడాలోని ఆయన నివాసంలోకి ఒక దుండగుడు చొరబడడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అప్రమత్తమైన భద్రతా దళాలు అతడిని కాల్చి చంపారు. ఈ ఘటన సమయంలో ట్రంప్ దంపతులు వైట్ హౌస్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఫ్లోరిడా పామ్ బీచ్ లో ఉన్న మార్ ఏ లాగో ఎస్టేట్ కు ట్రంప్ దంపతులు వీకెండ్ లో వెళుతూ ఉంటారు.

US President Donald Trump made shocking remarks saying he does not know how long he will be alive

షాట్ గన్ ఎక్కు పెట్టిన దుండగుడు.. కాల్చి చంపిన భద్రతా దళాలు

ఈ ఎస్టేట్ నార్త్ గేట్ నుంచి లోనికి ప్రవేశించిన ఓ దుండగుడు లోనికి వెళ్లే ప్రయత్నం చేయగా సెక్యూరిటీ గుర్తించి అతడిని పట్టుకున్నారు. అతడి చేతిలో ఒక ఆయుధంతో పాటు ఇంధనం క్యాన్ కూడా ఉన్నట్టు భద్రత దళాలు గుర్తించారు. అతడిని అడ్డుకున్న భద్రత దళాలపైన నిందితులు షాట్ గన్ ఎక్కు పెట్టడంతో వెంటనే అధికారులు అతడిని మట్టుబెట్టారు.

నేను ఎంత కాలం ఉంటానో నాకు తెలియదు అంటున్న ట్రంప్

ఈ ఘటన తర్వాత స్పందించిన డోనాల్డ్ ట్రంప్ నేను ఎంత కాలం ఉంటానో నాకు తెలియదు. నా కోసం చాలామంది తుపాకులతో కాపు కాస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల ప్రచార సమయంలో తనపై జరిగిన రెండు హత్యాయత్నాలు నుంచి ప్రాణాలతో బయటపడిన తరువాత ఆయన తాజా ఘటన పైన కూడా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.

పిచ్చి షూటర్లు ఎఫెక్టివ్ అధ్యక్షులనే టార్గెట్ చేస్తారన్న ట్రంప్

మీరు ఈ పిచ్చి షూటర్లు గురించి చదివే ఉంటారు కానీ వారు ప్రభావశీలురైన అధ్యక్షులను మాత్రమే టార్గెట్ చేస్తారు అన్నారు. తక్కువ ప్రభావం ఉన్న అధ్యక్షులు జోలికి వాళ్ళు వెళ్లరు అంటూ ట్రంప్ పేర్కొన్నారు. గతంలో హత్యకు గురైన అబ్రహం లింకన్, జాన్ ఎఫ్ కెన్నడీ లను గుర్తు చేసిన ట్రంప్ వారు చాలా ప్రభావవంతమైన అధ్యక్షులుగా పేర్కొన్నారు.

కాస్త తగ్గించుకుందామా.. ట్రంప్ వ్యంగ్యం

ఆ గొప్ప నాయకులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. బహుశా తను కొంచెం తక్కువ ప్రభావశీలి గా ఉండాలని అనుకుంటున్నారేమో అన్న ట్రంప్ కాస్త తగ్గించు కుందామా.. కొన్నాళ్లపాటు ఒక సాధారణ అధ్యక్షుడిగా ఉంటానంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+