అమెరికాలో విద్యాశాఖ మూసివేత.. ట్రంప్ సంచలన నిర్ణయం
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ తన పాలనలో తనదైన మార్క్ ను చూపిస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళ్తున్నారు. పలు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వలసలను కఠినతరం చేశారు. ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో విద్యాశాఖను మూసివేశారు. దానికి సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ గురువారం సంతకం చేశారు. వైట్ హౌస్ తూర్పు గదిలోని డెస్క్ ల వద్ద కూర్చున్న స్కూల్ పిల్లలతో ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసిన తర్వాత ట్రంప్ నవ్వుతూ ఆర్డర్ ను పైకెత్తి చూపారు. ఈ ఉత్తర్వుతో సమాఖ్య విద్యాశాఖ శాశ్వతంగా రద్దు చేయడం ప్రారంభమవుతుందని ట్రంప్ ప్రకటించారు.
విద్యాశాఖ పనికిరానిదని.. దాని ద్వారా మాకు ఎలాంటి మేలు జరగదని.. ఈ శాఖ అధికారాలను రాష్ట్రాలకు తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నామని ట్రంప్ పేర్కొన్నారు. అతి త్వరలోనే దీనిని అమలు చేస్తామన్నారు. అమెరికాలో డబ్బు ఆదా చేయడానికి, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఈ చర్య అవసరమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. వారు యూరప్, చైనా ప్రమాణాల కంటే వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు. ఆ విభాగం పూర్తిగా మూసివేయబడదని.. కొన్ని కీలకమైన విధులను కొనసాగిస్తుందని వైట్ హౌస్ తెసిపింది. వ్యయం తగ్గింపుపై దృష్టి పెట్టిన అధ్యక్షుడు ట్రంప్.. విద్యార్థుల ఫీజుల రాయితీలు, కొన్ని ముఖ్యమైన పథకాలను కొనసాగించనున్నారు.

డెమొక్రాట్లు, విద్యావేత్తలు ఈ చర్యను విమర్శించారు. సెనేట్‌లో అగ్రశ్రేణి డెమొక్రాట్ అయిన చక్ షుమెర్ దీనిని నిరంకుశ అధికారాన్ని చేజిక్కించుకునే చర్యగా, డొనాల్డ్ ట్రంప్ ఇప్పటివరకు తీసుకున్న అత్యంత దుర్మార్గమైన, విధ్వంసక చర్యలలో ఒకటిగా అభివర్ణించారు. ఫ్లోరిడా గవర్నర్లు రాన్ డిసాంటిస్, టెక్సాస్‌కు చెందిన గ్రెగ్ అబాట్ సహా రిపబ్లికన్ నాయకులు సంతకం కార్యక్రమానికి ప్రేక్షకులలో ఉన్నారు.
ట్రంప్ ఇప్పటివరకు తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలు
*అమెరికా నుండి అక్రమ వలసదారులను బహిష్కరించడం
*వివిధ దేశాలపై సుంకాలను ప్రకటించడం
*అమెరికా ఆర్థిక సహాయం మూసివేత
*అమెరికాలో లింగమార్పిడి వ్యవస్థను అంతం చేయడం
*ఐవీఎఫ్ టెక్నాలజీని సరసమైనదిగా చేయడం
*మాజీ అధ్యక్షులు మార్టిన్ లూథర్ కింగ్, జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యలకు సంబంధించిన పత్రాలను బహిర్గతం చేయడం
*వాక్ స్వాతంత్య్రానికి ప్రాధాన్యత ఇవ్వడం
I have tears in my eyes. Not only did Trump sign the Executive Order, the KIDS around him also signed their own Executive Orders. So historic ❤️
— MAGA Voice (@MAGAVoice) March 20, 2025
Abolish the Department of Education
Such a huge win for Kids pic.twitter.com/RWs0og5wMK












Click it and Unblock the Notifications