పుతిన్ ఏమన్నారంటే? జెలెన్ స్కీకి ట్రంప్ ఫోన్, కీలక చర్చలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)తో మంగళవారం చర్చలు జరిపిన విషయం తెలిసిందే. తాజాగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమీర్ జెలెన్ స్కీ్ (Volodymyr Zelenskyy)తోనూ ఫోన్ ద్వారా బుధవారం కీలక చర్చలు జరిపారు.
శాంతి ఒప్పందానికి సంబంధించి ఇరువర్గాల అభ్యర్థనను విన్నానని ట్రంప్ తెలిపారు. ఈ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా ఈ మేరకు జెలెన్ స్కీతో ఫోన్లో మాట్లాడిన వివరాలను డొనాల్డ్ ట్రంప్ పంచుకున్నారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమీర్ జెలెన్ స్కీతో ఫోన్టో మాట్లాడినట్లు ట్రంప్ తెలిపారు. దాదాపు గంటపాటు తమ సంభాషణ కొనసాగిందన్నారు. నిన్న పుతిన్ తో చర్చలపైనే ఎక్కువసేపు మాట్లాడుకున్నామని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్, రష్యా శాంతి ఒప్పందానికి సంబంధించి ఇరువర్గాల అభ్యర్థనలు, అవసరాలపై ఇవి కొనసాగుతాయన్నారు డొనాల్డ్ ట్రంప్.
సరైన దారిలోనే ముందుకెళ్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. చర్చలకు సంబంధించి వివరాలను రూపొందించాలని విదేశాంగ శాఖ మంత్రి మార్కూ రూబియో, జాతీయ భద్రతా సలహాదారు మైఖైల్ వాల్ట్‌లను ఆదేశిస్తానని డొనల్డ్ ట్రంప్ తెలిపారు. త్వరలోనే జరిగిన తాజా పరిణామాలపై వివరాలు వెల్లడిస్తానని ఆయన చెప్పారు.
అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించాలని, శాశ్వత శాంతి కోసం ఇరుదేశాలు ముందుకు రావాలని ట్రంప్ కోరారు. దీనికి పుతిన్ సానుకూలంగా స్పందించారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. అయితే, ట్రంప్ ఫోన్ చేస్తే.. సుమారు గంటపాటు పుతిన్ వెయిట్ చేయించినట్లు సమాచారం. ఆ తర్వాత దాదాపు రెండు గంటలపాటు ఇరుదేశాధి నేతలు చర్చలు జరిపారు. అయితే, ఉక్రెయిన్ భూభాగం రష్యాలోనే ఉందని అమెరికా గుర్తించాలని ట్రంప్ ముందు పుతిన్ డిమాండ్ పెట్టినట్లు సమాచారం.
-
ఇరాన్ నష్టం రోజుకు రూ. 4,000 కోట్లు పైమాటే -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
స్వయానా ట్రంప్ నోట -
మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications