రష్యా - ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ?.. ట్రంప్- జెలెన్ స్కీ కీలక బేటీ!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు దగ్గరపడింది. ఆ దిశాగా అమెరికా పెదన్న పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మాస్కోలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ కానున్నారు. అటు అమెరికాతో ఒప్పందం చేసుకోవడానికి మాస్కో సిద్ధంగా ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు సరైన మార్గంలో ఆలోచించడం వల్లే ప్రస్తుతం శాంతి చర్చలు సవ్యదిశగా సాగుతున్నాయని చెప్పుకొచ్చారు.
ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భేటీ అయ్యారు. ఈ భేటీ వాటికిన్ సిటీ వేదక అయింది. సెయింట్ పీటర్స్ స్క్వేర్ లో శనివారం పోప్ ఫ్రాన్సిస్ అంతిమయాత్ర సాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రంపంచ దేశాల అధినేతలు, ప్రతినిధులు దాదాపు 164 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అమెరికా, ఫ్రాన్స్, ఉక్రెయిన్ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, మెక్రాన్, జెలెన్ స్కీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ - జెలెన్ స్కీ భేటీ సమావేశమైయ్యారు. యుద్ధం ముగింపు, ఖనిజాల ఒప్పందం వంటి అంశాలపై వీరు చర్చించినినట్లు .. వారి మధ్య చర్చలు సానుకూలంగా సాగాయని అధ్యక్ష కార్యాలయాలు వెల్లడించాయి.

అమెరికాలోని ఓవల్ కార్యాలయంలో గతంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ కలుసుకోవడం ఇదే మొదటి సారి. పైగా, ఉక్రెయిన్ యుద్ధంపై వారంలోపే ఓ ఒప్పందం కుదురుతుందని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో, ఈ సమావేశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, పోప్ అంత్యక్రియల కార్యక్రమంలో వీరిద్దరూ వేర్వేరు చోట్ల కూర్చోవడం, వారి మధ్య ఇంకా మనస్పర్థలు ఉన్నాయన్న ఊహాగానాలకు తావిచ్చింది. వీటిపై వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్ స్పందిస్తూ, కార్యక్రమానికి హాజరైన దేశాల ప్రతినిధులకు ఫ్రెంచ్ అక్షర క్రమంలో సీటింగ్ ఏర్పాటు చేశారని, అంతకు మించి వేరే కారణం లేదని వివరణ ఇచ్చారు.
ఈ భేటీ ఒకవైపు కొనసాగుతుండగానే, ట్రంప్ శుక్రవారం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా, క్రిమియా రష్యాతోనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఒబామా హయాంలోనే సబ్‌మెరైన్లను రష్యా అక్కడ మోహరించిందని గుర్తు చేశారు. జెలెన్‌స్కీతో సహా ప్రతి ఒక్కరూ ఈ వాస్తవాన్ని త్వరలో అర్థం చేసుకుంటారని తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలను అడ్డుకుంటూ, జెలెన్‌స్కీ యుద్ధాన్ని పొడిగిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.
అయితే, ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న భీకర దాడులపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సరైన సమయం కాదని, వారానికి ఐదు వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని పుతిన్‌కు సూచించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణానికి చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications