వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా హెచ్చరికల్ని ఉక్రెయిన్ పట్టించుకోలేదా ? బైడెన్ సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రకు సంబంధించి అమెరికా ముందస్తు హెచ్చరికలు చేసినా ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ పట్టించుకోలేదన్న విషయం బయటపడింది. రష్యా ఉక్రెయిన్ పై దాడి చేస్తుందని తాను ముందుగానే హెచ్చరించినా జెలెన్ స్కీ మాత్రం దీన్ని వినడానికి కూడా ఇష్టపడలేదని బైడెన్ తాజాగా వెల్లడించారు.

ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ముుందుగానే హెచ్చరించారు. అయితే ఆయన వ్యాఖ్యల్ని అప్పట్లో ఉక్రెయినే కాదు ఇతర దేశాలు కూడా పట్టించుకోలేదు. కానీ రష్యా అనుకున్నవిధంగానే ఉక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టడం, అది ఇప్పటికీ కొనసాగడం కూడా జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా అధినేత జో బైడెన్ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నాలుగు నెలల క్రితం పరిణామాల్ని గుర్తు చేసుకున్నారు.

us president joe biden says ukraine prez zelenskyy not heard warnings on russian evasion

తమకు ఉన్న సమాచారం ఆధారంగా రష్యా అప్పట్లో ఉక్రెయిన్ పై భారీ దాడికి ప్లాన్ చేస్తున్నట్లు హెచ్చరించామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. అప్పట్లో పుతిన్ ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాత్రం ఈ విషయాన్ని వినడానికి కూడా ఇష్టపడలేదని తాజాగా బైడెన్ తెలిపారు. జెలెన్ స్కీ ఎందుకు అలా వ్యవహరించారో తనకు అర్ధం కాలేదని, కానీ అంతలోనే రష్యా దాడికి దిగినట్లు బైడెన్ పేర్కొన్నారు. ఆ తర్వాత జరగాల్సింది అంతా జరిగిందన్నారు.

English summary
US president joe biden on today recollects his warning to ukraine president zelenskyy on russian evasion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X