India very big abuser: మోదీని కలుస్తానంటోన్న ట్రంప్

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రోజూ వార్తల్లో నిలుస్తోన్నారు. మొన్నటికి మొన్న ఆయన హత్యాయాత్నం జరిగింది. రెండు నెలల వ్యవధిలో ఆయనపై కాల్పులు జరగడం ఇది రెండోసారి. అంతకుముందు- జులై 13వ తేదీన ఆయనపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.

ఈ సారి వివాదాస్పద వ్యాఖ్యలతో తెరపైకి వచ్చారు. భారత్‌ను వెరీ బిగ్ అబ్యూజర్‌గా అభివర్ణించారు ట్రంప్. తమదేశంతో ఉన్న వాణిజ్య సంబంధాలను దుర్వినియోగం చేసేలా భారత్ వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో భారత్- అతి పెద్ద దుర్వినియోగదారుడంటూ పేర్కొన్నారు.

US Presidential election 2024 Donald Trump set to meet PM Modi next

అదే సమయంలో- ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు డొనాల్డ్ ట్రంప్. ఆయన ఓ అద్భుతం అంటూ కితాబిచ్చారు. వచ్చేవారం ఆయనను కలుస్తాననీ చెప్పారు. ఎక్కడ కలుస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. మోదీని కలవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలంటూ తన టీమ్‌ను ఆదేశించినట్లు వివరించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మిచిగాన్‌లో పర్యటించారు ట్రంప్. ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అమెరికా- భారత్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న వాణిజ్య సంబంధాల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా భారత్‌ను వెరీ బిగ్ అబ్యూజర్‌గా అభివర్ణించారు. దీనిపై చర్చించడానికి మోదీని కలుస్తాననీ పేర్కొన్నారు.

ఈ నెల 20వ తేదీన ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్న విషయం తెలిసిందే. 21వ తేదీన క్వాడ్ సభ్య దేశాల అత్యున్నత స్థాయి సమ్మిట్‌కు ఆయన హాజరు కావాల్సి ఉంది. ఈ సమ్మిట్‌కు అమెరికా ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. అమెరికాతో పాటు భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌కు ఇందులో సభ్యత్వం ఉంది.

జో బైడెన్‌తో పాటు ఆయా దేశాల ప్రధాన మంత్రులు మోదీ, ఆంటొని అల్బెనీస్, ఫ్యుమియో కిషిడ ఇందులో పాల్గొంటారు. డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో ఈ సదస్సు ఏర్పాటు కానుంది. ఇందులో పాల్గొన్న అనంతరం మోదీ న్యూయార్క్‌లో పర్యటించాల్సి ఉంది. నస్సౌ వెటరన్స్ మెమోరియల్ కొలీజియంలో ఏర్పాటు అయ్యే ఓ భారీ కార్యక్రమానికి హాజరవుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+