వేడెక్కిన అమెరికా: డొనాల్డ్ ట్రంప్ ఖాతాలో భారీ విజయం

Donald Trump: ఈ ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ఎన్నికల పోలింగ్‌ను డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉందక్కడ. జో బైడెన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన పదవీ కాలం ముగియడానికి ఇంకో ఏడాది మాత్రమే మిగిలివుంది.

ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ.. ఎన్నికల కోసం సన్నాహాలు చేపట్టింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తమ పార్టీ అభ్యర్థిగా ఎన్నుకుంది. ఆయనపై పలు నేరారోపణలు, కేసులు ఉన్నప్పటికీ.. ట్రంప్‌పైనే విశ్వాసం ఉంచింది. 2019 నాటి ఎన్నికల్లో ఓడినా మళ్లీ ట్రంప్ అభ్యర్థిత్వానికే మొగ్గు చూపింది.

US Presidential election 2024: Donald Trump wins New Hampshire Republicans primary

అభ్యర్థిని ఎంచుకోవడానికి అయోవా స్టేట్‌లో నిర్వహించిన ప్రాథమిక ఎలక్టోరల్ ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయనకు 52.8 శాతం మేర ఓట్లు పోల్ అయ్యాయి. అభ్యర్థి ఎన్నికల్లో నిలిచిన రాన్ డీశాంటీస్- 21.4, నిక్కీ హేలీ-17.7, వివేక్ రామస్వామి- 7.2 శాతం ఓట్లు పడ్డాయి. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ఇద్దరూ భారత సంతతికి చెందినవారే.

వివేక్ రామస్వామి, రాన్ డీశాంటీస్ ఇప్పటికే తమ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకొన్నారు. తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. ప్రస్తుం పార్టీలో డొనాల్డ్ ట్రంప్‌కు పోటీ ఇస్తోన్నది ఒక్క నిక్కీ హేలీ మాత్రమే. వారిద్దరిలో తమ అభ్యర్థిగా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంపై ఇప్పుడు తాజాగా మరో స్టేట్‌లో ఎన్నిక ప్రక్రియను చేపట్టారు రిపబ్లికన్లు.

న్యూ హ్యాంప్‌షైర్‌లో నిర్వహించిన ఈ ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ భారీ విజయాన్ని సాధించారు. నిక్కీ హేలీ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. డొనాల్డ్ ట్రంప్‌కు 53.8 శాత మేర ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తంగా 41,423 ఓట్లు పడ్డాయి. 46.1 శాతంతో 36,083 ఓట్లను సాధించారు నిక్కీ హేలీ. కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇద్దరి ఓట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

వరుసగా మూడోసారి డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమైనట్టే. 2016 నాటి ఎన్నికల్లో ఆయన సారథ్యంలోనే ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ తరువాతి ఎన్నికల్లో స్వల్ప తేడాతో పరాజయం చవి చూశారు. మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు డొనాల్డ్ ట్రంప్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+