డొనాల్డ్ ట్రంప్‌కు తొలగిన అడ్డంకి..
Nikki Haley: ఈ ఏడాది.. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ఎన్నికల పోలింగ్‌ను డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉందక్కడ. జో బైడెన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన పదవీ కాలం ముగియడానికి ఇంకో ఏడెనిమిది నెలలే మిగిలివుంది.
అదే సమయంలో ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ.. ఎన్నికల కోసం సన్నాహాలు చేపట్టింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తమ పార్టీ అభ్యర్థిగా ఎన్నుకుంది. ఆయనపై పలు నేరారోపణలు, కేసులు ఉన్నప్పటికీ.. ట్రంప్‌పైనే విశ్వాసం ఉంచింది. 2019 నాటి ఎన్నికల్లో ఓడినప్పటికీ.. మళ్లీ ట్రంప్ అభ్యర్థిత్వం వైపే మొగ్గు చూపడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

తమ పార్టీ తరఫున అభ్యర్థిని ఎంచుకోవడానికి అయోవా స్టేట్‌లో రిపబ్లికన్లు నిర్వహించిన ప్రాథమిక ఎలక్టోరల్ ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీని తరువాత పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. అప్పటి వరకు అభ్యర్థి ఎన్నికల్లో నిలిచిన రాన్ డీశాంటీస్, వివేక్ రామస్వామి తప్పుకొన్నారు. నిక్కీ హేలీ మాత్రమే ట్రంప్‌తో పోటీ పడ్డారు.
తాజాగా నిర్వహించిన ఎన్నికలో ఆమె సైతం ఓడిపోయారు. దీనితో తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు నిక్కీ హేలీ. కొద్దిసేపటి కిందటే ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకొంటోన్నట్లు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తోన్నట్లు ప్రకటించారు.
ఎన్నికల రేసు నుంచి తప్పుకొన్నప్పటికీ.. తన గళాన్ని వినిపిస్తూనే ఉంటానని, డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటానని నిక్కీ హేలీ అన్నారు. అమెరికా వ్యాప్తంగా పర్యటిస్తానని తెలిపారు. ట్రంప్ ఎన్నికల టీమ్‌లో కీలకంగా వ్యవహరిస్తాననీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
-
కదనరంగంలో కాలు పెట్టిన అమెరికా మెరైన్ మెరికలు- ఇరాన్ యుద్ధం తీవ్రం -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications