అధ్యక్ష ఎన్నికల వేళ.. యూఎస్‌లో హాట్ టాపిక్‌గా ఉషా చిలుకూరి
Usha Chilukuri Vence: అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రచార తీవ్రత పెరిగింది. అధికారంలో ఉన్న డెమొక్రాట్లు, ప్రతిపక్ష రిపబ్లికన్లు దేశవ్యాప్తంగా ర్యాలీలకు శ్రీకారం చుట్టాయి. వచ్చే అయిదు నెలలపాటు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కోలాహలం నెలకొనబోతోంది.
పాత అభ్యర్థులే..
2019 నాటి ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ పార్టీ అభ్యర్థి జో బైడెన్.. అధ్యక్షుడిగా, భారత సంతతికి చెందిన కమల హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించారు. ఇప్పుడు మళ్లీ బైడెన్ అధ్యక్ష ఎన్నికల్లో నిలిచారు. కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని ఇంకా ఖరారు చేయలేదు డెమోక్రాట్లు.

మూడోసారి..
రిపబ్లికన్ల తరఫున కూడా అభ్యర్థి మారలేదు. 2019 నాటి ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓడిపోయిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. పెన్సిల్వేనియాలో ఆయనపై హత్యాయత్నం తరువాత పరిస్థితులు సానుకూలంగా మారినట్లు అమెరికా మీడియా అంచనా వేస్తోంది.
వైస్ ప్రెసిడెంట్‌గా..
తాజాగా తమ ఉపాధ్యక్ష అభ్యర్థిని ప్రకటించింది రిపబ్లికన్ పార్టీ. ఓహియో సెనెటర్ జేమ్స్ డేవిడ్ వెన్స్ పేరును ఖరారు చేసింది. డొనాల్డ్ ట్రంప్ రన్- మేట్‌గా ప్రకటించింది. విస్కాన్సిస్‌లోని మిల్వాకీలో నిర్వహించిన నేషనల్ కన్వెన్షన్ సందర్భంగా ఉపాధ్యక్ష అభ్యర్థి జేమ్స్ డేవిడ్ వెన్స్ పేరును అధికారికంగా ప్రకటించింది.

ఉషా చిలుకూరి..
జేడీ వెన్స్ భార్య.. ఉషా చిలుకూరి. భారత సంతతికి చెందిన మహిళ. 1986 జనవరి 6వ తేదీన కాలిఫోర్నియా శాన్‌డియాగోలో జన్మించారు. వృత్తిరీత్యా అడ్వొకేట్. యేల్ యూనివర్శిటీ బ్యాచిలర్ డిగ్రీ, కేంబ్రిడ్జి యూనివర్శిటీలో ఎంఫిల్ పూర్తిచేశారు. గేట్స్ కేంబ్రిడ్జి స్కాలర్‌షిప్ కింద ఆమె ఎంఫిల్ చదివారు.

2014లో వివాహం..
2014లో జేడీ వెన్స్‌ను పెళ్లాడారు. వారిది లవ్ మ్యారేజ్. రోమన్ క్యాథలిక్ అయిన జేడీ.. యేల్ యూనివర్శిటీలో చదువుకుంటోన్నప్పుడు ఆమెకు పరిచయం అయ్యారు. అప్పటివరకు డెమొక్రాట్లకు సపోర్ట్ చేస్తూ వచ్చిన ఉషా.. పెళ్లి తరువాత రిపబ్లిక్ పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి ఇవాన్, వివేక్, మిరాబెల్ అనే పిల్లలు ఉన్నారు.












Click it and Unblock the Notifications