US Polls: చివరి నిమిషంలో ఆ 3 రాష్ట్రాలపై ట్రంప్, కమల ఇద్దరూ ఫోకస్-ఎందుకంటే ?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు చివరి నిమిషంలో మరింత రసవత్తరంగా మారిపోతున్నాయి. ఇప్పటికే 50 రాష్ట్రాల్లో జరగాల్సిన ఎన్నికల అసలు పోరు కాస్తా 7 స్వింగ్ రాష్ట్రాలకు పరిమితం అవుతుండగా..ఇది చివరి నిమిషంలో కేవలం మూడు రాష్ట్రాలకు తగ్గిపోవడం రాజకీయ విశ్లేషకుల్నే ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఆ మూడు రాష్ట్రాలేంటి, బ్లూవాల్ రాష్ట్రాలుగా పేర్కొనే ఆ మూడు రాష్ట్రాలపై చివరి నిమిషంలో అధ్యక్ష ఎన్నికల అభ్యర్ధులు డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ ఎందుకు ఫోకస్ పెట్టారో చూద్దాం..

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు గతంలో ఎన్నడూ లేనంత తారా స్ధాయిలో సాగుతోంది. ఇప్పటికే అధ్యక్ష అభ్యర్ధులు డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య హోరాహోరీగా సాగుతుండగా.. వీరిలో ఓటర్లు ఎవరికి అండగా నిలవబోతున్నారనే అంశం ఒపీనియన్ పోల్స్, సర్వే సంస్థలకు సైతం అందడం లేదు. ఈ నేపథ్యంలో అసలు 50 రాష్ట్రాల మధ్య జరగాల్సిన పోటీ కాస్తా 7 స్వింగ్ రాష్ట్రాలకే పరిమితమైందన్న వాదన మొదలైంది. ఇది కాస్తా ఇప్పుడు చివరి నిమిషంలో 3 బ్లూవాల్ రాష్ట్రాలకు చేరిందట.

US presidential Election candidates trump kamala s last minute focus on blue wall states- why

ఎన్నికలకు కొన్ని గంటల ముందు అభ్యర్ధులు డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ ఇద్దరూ మూడు బ్లూ వాల్ రాష్ట్రాలు మిచిగాన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియాపై కేంద్రీకరించారు. ఇవి ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో మూడు. అయినా స్వింగ్ రాష్ట్రాలను మించి ఇక్కడ హోరాహోరీ పోరు జరగబోతోందనే అంచనాలు రావడంతో అభ్యర్ధులు వీటిపై లాస్ట్ మినిట్ ఫోకస్ పెట్టారు. దీంతో ఈ మూడు రాష్ట్రాలే ఇప్పుడు విజేతను నిర్ణయించబోతున్నాయనే చర్చ సాగుతోంది.

ఈ మూడు బ్లూవాల్ రాష్ట్రాల్లో చూస్తే అత్యధికంగా పెన్సిల్వేనియాలో 19 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. ఇక్కడ ఆధిక్యం తెచ్చుకోలేకపోతే ఇక అధ్యక్ష ఎన్నికల్లో ఓడినట్లే అనుకోవచ్చు. అలాగే 15 ఎలక్ట్రోరల్ ఓట్లున్న మిచిగాన్ 2016లో ట్రంప్‌ కు, 2020లో బైడెన్ కు అండగా నిలిచింది. కాబట్టి ఈ రాష్ట్రం కూడా అత్యంత కీలకం. మరో బ్లూవాల్ రాష్ట్రం విస్కాన్సిన్ లో 10 ఎలక్ట్రోరల్ ఓట్లు ఉన్నాయి. అయితే ఇది గతం నుంచీ డెమోక్రాట్లకు పక్కాగా అండగా నిలుస్తూ వస్తోంది. దీంతో ఇక్కడ పట్టు కొనసాగించడానికి కమల, ఆధిక్యం కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారు.

ఈ మూడు బ్లూవాల్ రాష్ట్రాల్లోనూ యూనియన్ కార్మికులు ఎక్కువగా ఉన్నారు. అలాగే నల్లజాతి ఓటర్లు విస్కాన్సిన్ లో ఎక్కువగా ఉన్నారు. అలాగే మిచిగాన్ లో పెద్ద సంఖ్యలో అరబ్ ఓటర్లున్నారు. వీరిపై పాలస్తీనా, ఇజ్రాయెల్ వార్ ప్రభావం కనిపిస్తోంది. అలాగే యూదు ఓటర్లలో ట్రంప్ పై విశ్వాసం కనిపిస్తోంది. దీంతో చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చనే అంచనాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+