డొనాల్డ్ ట్రంప్‌పై నిఘా: కీ రిపోర్ట్- బాంబు పేల్చిన చైనా

Donald Trump: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడిగా పతాక స్థాయికి చేరింది. ఎన్నికల ప్రచార ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లతో అక్కడి రాష్ట్రాలు హోరెత్తిపోతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డెమోక్రాట్లు, గెలిచి తీరాలనే పట్టుదలతో రిపబ్లికన్లు పోరాడుతున్నారు.

నవంబర్ 5వ తేదీన అక్కడ పోలింగ్ జరుగనుంది. డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో దిగిన విషయం తెలిసిందే. నార్త్ కరోలినా, ఆస్టిన్, టెక్సాస్, పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాల్లో ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ ఇప్పటికే ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. ముమ్మర ప్రచారాన్ని సాగిస్తోన్నారు.

US Presidential elections 2024 Chinese hackers targeted phone data of Donald Trump JD Vance

ఈ పరిస్థితుల మధ్య సంచలన రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్ మొబైల్ ఫోన్లు హ్యాక్ అయ్యాయి. వాటిల్లోని డేటా మొత్తం కూడా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లింది. దీని వెనుక చైనా ఉన్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎఫ్‌బీఐ, యూఎస్ సైబర్ సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్ధారించాయి.

దీనిపై ఓ ప్రకటన విడుదల చేశాయి. డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్ మొబైల్ ఫోన్లు అయ్యాయని, అందులోని డేటా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిందనీ స్పష్టం చేశాయి. ఈ డేటా మొత్తం కూడా చైనాకు చెందిన ఓ కమర్షియల్ టెలికమ్యూనికేషన్ సంస్థకు బదలాయింపు జరిగినట్లు అనుమానిస్తున్నామని పేర్కొన్నాయి.

అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన కొంత కీలక డేటా ఇప్పుడు చైనా చేతుల్లోకి వెళ్లినట్టయిందనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఆ దేశ న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన కొన్ని కేసులు, వైర్ ట్యాప్ వారెంట్ వివరాల యాక్సెస్‌ను హ్యాకర్స్ పొందగలిగినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.

US Presidential elections 2024 Chinese hackers targeted phone data of Donald Trump JD Vance

యూఎస్ బ్రాడ్ బ్యాండ్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఏటీ అండ్ టీ, వెరిజాన్, ల్యూమెన్ వంటి సంస్థల నెట్‌వర్క్‌ను కూడా చైనా హ్యాకర్లు టార్గెట్‌గా చేసుకున్నారనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. అవి ఎంత వరకు హ్యాక్ అయ్యాయనేది తెలియరావట్లేదు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టీమ్‌లో పని చేస్తోన్న ఇద్దరు ఉన్నతాధికారుల ఫోన్లు సైతం హ్యాక్ అయినట్లు పేర్కొంది. ఫోన్లు హ్యాక్ అయిన విషయాన్ని ఎఫ్‌బీఐ అధికారులు డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్‌కు తెలియజేశారు. దీనిపై ట్రంప్ ఎన్నికల ప్రచార వ్యవహారాల పర్యవేక్షిస్తోన్న స్టీవెన్ ఘాటుగా స్పందించారు. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ ప్రమేయం ఉండొచ్చని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+