అమెరికా అధ్యక్ష అభ్యర్ధి పోరులో ట్విస్ట్-వివేక్ రామస్వామి యూటర్న్-ట్రంప్ వెనుకే..!

వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో నిలిచి తొలి డిబేట్ లో కూడా పాల్గొన్న భారతీయ మూలాలున్న వివేక్ రామస్వామి సడన్ గా యూటర్న్ తీసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల రేసులో తాను గెలవలేననే నిర్ణయానికి వచ్చేశారో ఏమో కానీ ఉపాధ్యక్ష పదవికైనా ఓకే అంటూ ప్రకటన చేశారు. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్ధిని తేల్చేందుకు జరుగుతున్న పోటీ నుంచి వివేక్ దాదాపు తప్పుకున్నట్లయింది.

కొన్ని రోజుల క్రితమే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా పోటీ పడేది లేదంటూ ప్రకటించిన వివేక్ రామస్వామి.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పోటీలో నిలిచారు. అయితే మరో భారతీయ మూలాలున్న అభ్యర్ధి నిక్కీ హేలీతో కలిసి రిపబ్లికన్ అభ్యర్ధిని నిర్ణయించే తొలి డిబేట్ లో పాల్గొన్న రామస్వామి ఇవాళ వెనక్కి తగ్గారు. రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష పదవికి ప్రధాన పోటీదారుగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ తో పోటీ పడేందుకు ఇష్టపడని రామస్వామి.. ఆయనకు డిప్యూటీగా పోటీ పడేందుకు సిద్ధమని వెల్లడించారు.

vivek ramaswamy

నిక్కీ హేలీతో రిపబ్లికన్ అభ్యర్ధి రేసు డిబేట్ లో పాల్గొన్న అనంతరం వివేక్ రామస్వామి కీలక ప్రకటన చేశారు. అధ్యక్ష ఎన్నికల రేసులో తాను, ట్రంప్ మాత్రమే నిలుస్తామని చెప్పుకొచ్చారు. అయితే తనకు అభ్యర్ధిత్వం దక్కకపోతే ట్రంప్ కు డిప్యూటీగా పోటీ పడేందుకు సిద్ధమని వివేక్ చేసిన ప్రకటనతో దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. 38 ఏళ్ల వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ఉపాధ్యక్షుడిగా పోటీ పడినా కూడా గతంలో 36 ఏళ్లకే ఈ పోటీలో నిలిచిన జాన్ బ్రెకెన్ రిడ్జ్ తర్వాత రెండో పిన్న వయస్కుడిగా నిలుస్తారు.

ఇప్పటికే తన తొలి డిబేట్ లో ట్రంప్ గత పాలనపై ప్రశంసల జల్లు కురిపించిన వివేక్ రామస్వామిపై ఆయన వర్గం నుంచి మద్దతు లభిస్తోంది. దీంతో ఉపాధ్యక్ష పదవికి పోటీ పడితే తప్పకుండా గెలుస్తానని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అధ్యక్ష పదవికి ట్రంప్ తో పోటీ పడినా ఉపయోగం లేదని భావించడం వల్లే వివేక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆయనకు పోటీగా నిలిచిన నిక్కీ హేలీ మాత్రం రిపబ్లికన్ల అధ్యక్ష పదవి అభ్యర్ధిగా ట్రంప్ తో పోటీ పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+