అమెరికా అధ్యక్ష పోరులో ట్రంప్ ముందంజ-వెనుకబడ్డ బైడెన్-ప్రీపోల్స్ లో ఆధిక్యం..
వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. మూడేళ్ల క్రితం డొనాల్డ్ ట్రంప్ ను వెనక్కి నెట్టి స్పష్టమైన అధిక్యంతో అధ్యక్ష పదవి అలంకరించిన జో బైడెన్ మరోసారి పోటీ పడేందుకు సిద్ధమవుతుండగా.. మళ్లీ గెలిచి సత్తా చాటుకోవాలని ట్రంప్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు కోర్టు కేసులతో పోరాడుతూనే మరోవైపు బైడెన్ పై మరో పోరుకు సిద్దమవుతున్న ట్రంప్ కు తాజాగా ఓ గుడ్ న్యూస్ వచ్చింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ఎవరు ముందున్నారన్న దానిపై తాజాగా ఏబీసీ న్యూస్, వాషింగ్టన్ పోస్ట్ సంయుక్తంగా నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో డొనాల్డ్ ట్రంప్.. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కంటే ఆధిక్యంలో నిలిచారు. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఎవరన్న దానిపై నిర్వహించిన ఈ సర్వేలో బైడెన్ కంటే ట్రంప్ 10 పాయింట్ల లీడ్ లో ఉన్నారు. అలాగే ఏబీసీ న్యూస్-వాషింగ్టన్ పోస్ట్ గత సర్వేతో పోలిస్తే బైడెన్ ను ఆమోదిస్తున్న వారి రేటు 19 పాయింట్లు తగ్గినట్లు తేలింది.

అమెరికా ఆర్ధిక వ్యవస్ధతో పాటు ఇమ్మిగ్రేషన్ అంశాల నిర్వహణ విషయంలో గత సర్వేతో పోలిస్తే బైడెన్ రేటింగ్ తగ్గినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఆర్ధిక అంశాల విషయంలో అయితే కేవలం 30 శాతం మంది మాత్రమే బైడెన్ కు మద్దతిస్తున్నట్లు తేలింది. అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో ఇమ్మిగ్రేషన్ సమస్య పరిష్కారం విషయంలో అయితే కేవలం 23 శాతం మంది మాత్రమే బైడెన్ కు మద్దతు పలుకుతున్నారు. మొత్తంగా చూసినా బైడెన్ కు కేవలం 37 శాతం మంది మాత్రమే మద్దతు పలుకుతుండగా.. 57 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు.
మరోవైపు ఈ సర్వేలో పాల్గొన్నవారిలో ఏకంగా 74 శాతం మంది జో బైడెన్ వయసు రీత్యా సమర్ధించలేకపోయారు. ప్రస్తుతం బైడెన్ వయస్సు రీత్యా ఆయనకు మరో అవకాశం ఇవ్వడం సరికాదని వారు భావిస్తున్నారు. అలాగే వీరు ట్రంప్ విషయంలోనూ వయస్సు అంశాన్ని అభ్యంతరం చెప్పారు. ప్రభుత్వం షట్ డౌన్ విషయంలో కాంగ్రెస్ లో డెమోక్రాట్లదే తప్పని 40 శాతం మంది అభిప్రాయపడగా.. 33 శాతం మంది రిపబ్లికన్లదే తప్పన్నారు.
2021లో ట్రంప్ పనితీరుపై కేవలం 38 శాతం మంది మాత్రమే మద్దతు పలకగా.. ఇప్పుడు ఆ సంఖ్య 48కి చేరడం విశేషం. అయినా ఇప్పటికీ ట్రంప్ పనితీరుపై 49 శాతం మంది అసంతృప్తిగానే ఉన్నట్లు తేలింది. కానీ 56 శాతం మంది మాత్రం బైడెన్ పనితీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. అందులో 75 శాతం మంది అయితే తిరిగి ట్రంప్ కు ఓటేస్తామని చెప్పారు. అలాగే 2020 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ట్రంప్ ఆరోపణల్ని మాత్రం చాలా మంది నమ్మడం లేదని తేలింది. నవంబర్ 2024లో జరిగే ఎన్నికలపై జరిగిన ఒక ఊహాజనిత పోటీలో ట్రంప్‌కి 51 శాతం మద్దతు లభించగా.. బైడెన్ కు కేవలం 42 శాతం మాత్రమే మద్దతు లభించింది. గతంలో జరిగిన సర్వేలతో పోలిస్తే ఇరువురికూ మూడేసి పాయింట్లు చొప్పున తగ్గినా.. ఇంకా ట్రంప్ 50 శాతంపైగా మద్దతు పొందడం ఆయన లీడ్ ను సూచిస్తోందని చెబుతున్నారు.
-
ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications