అమెరికాలో మొదలైన ముందస్తు ఓటింగ్..! ట్రంప్-కమల హోరాహోరీ వేళ ఉత్కంఠ..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్, డెమెక్రాట్ల అభ్యర్ధి కమలా హ్యరిస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ముఖ్యంగా ఎప్పుడూ ఫలితాన్ని నిర్ణయిస్తాయని పేరున్న స్వింగ్ రాష్ట్రాల్లో సైతం వీరిద్దరి మధ్య గట్టిపోటీ నెలకుందని, ఇందులో ఎవరైనా గెలిచే అవకాశాలు ఉన్నాయని తాజా సర్వేలు తేల్చిచెప్పేశాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఎన్నికల ముందస్తు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

అరబ్ అమెరికన్లలో కమలా హ్యారిస్ కంటే ట్రంప్ లీడ్ లో ఉన్నట్లు తాజా సర్వేలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ముందస్తు ఓటింగ్ ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది. తాజా సర్వేలో ట్రంప్ తో పాటు కమలా హ్యారిస్ కు సమానంగా చెరో 47 శాతం మంది ఓటేస్తామని వెల్లడించారు. కొలంబియా జిల్లాతో పాటు మొత్తం 47 రాష్ట్రాలు ముందస్తు ఓటింగ్‌ను ప్రారంభిస్తున్నాయి. ఫ్లోరిడాలో వ్యక్తిగతంగా కాకుండా పరోక్షంగా వేసే ఓటింగ్ విస్కాన్సిన్‌లో ప్రారంభమవుతోంది. ముందస్తు ఓటింగ్ సాధారణంగా ఎన్నికల రోజుకు రెండు వారాల ముందు ప్రారంభమవుతుంది. ఇది నవంబర్ 3 వరకు కొనసాగుతుంది.

US Presidential Polls early voting begins in swing states as keen fight between kamala trump

మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రోజూ మిలియన్ డాలర్లు పంచిపెడుతూ ప్రభావం చూపుతున్నారు. ఆయన ట్రంప్ కు మద్దతుగా ఎన్నికల్లో వ్యూహాలు రచిస్తున్నారు. అదే సమయంలో తాజాగా ఓ కేసులో ట్రంప్ కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మరోవైపు ఎన్నికల నిధుల సేకరణ విషయంలో ట్రంప్ కంటే కమలా హ్యారిస్ ముందున్నారు. దీంతో పలు అంశాల్లో ఇద్దరికీ అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్ సరళి తేలితే తప్ప ఈసారి ఎన్నికలపై ఉత్కంఠ వీడేలా లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+