ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ బహుమతి: ఏ పరిశోధనకంటే?

స్టాక్‌హోం: ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్​ బహుమతి (Nobel Prize) 2023కి గానూ క్లాడియా గొల్డిన్ (Claudia Goldin)​ను వరించింది. లేబర్ మార్కెట్‌లో మహిళల ప్రాతినిథ్యంతో వచ్చే ఫలితాలపై అధ్యయనానికి గానూ గోల్డిన్‌కు ఈ అవార్డును ప్రకటించింది రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌.

కాగా, ఈ ఏడాది నోబెల్‌ పురస్కారాల ప్రకటన గత సోమవారం ప్రారంభమైన విషయం తెలిసందే. తొలిరోజు వైద్య శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ పురస్కారాన్ని ప్రకటించారు. కొవిడ్‌ మహమ్మారిపై పోరు కోసం సమర్థ ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల అభివృద్ధికి మార్గం సుగమం చేసిన శాస్త్రవేత్తలు కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌లకు ఈ అవార్డు లభించింది.

US Professor Claudia Goldin Wins Nobel Prize In Economic Sciences

గత మంగళవారం భౌతిక శాస్త్ర విభాగంలో అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెరెన్స్‌ క్రౌజ్‌, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్‌ హ్యులియర్‌కు, బుధవారం రసాయనశాస్త్ర విభాగంలో అమెరికాకు చెందిన మౌంగి బవెండి, లూయిస్‌ బ్రూస్‌, అలెక్సీ ఎకిమోవ్‌కు ప్రకటించారు.

గురువారం రోజున సాహిత్యం విభాగంలో నార్వేకు చెందిన రచయిత జాన్ ఫోసేకు నోబెల్ బహుమతి ప్రకటించారు. శుక్రవారం రోజున ప్రకటించిన 2023 నోబెల్‌ శాంతి బహుమతిని ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నార్గెస్‌ మొహమ్మదిని వరించింది. ఈ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబరు 10న గ్రహీతలకు అందజేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+