చైనా యాప్స్‌పై భారత్ నిషేధం... భేష్ అంటూ అమెరికా ప్రశంసలు...
భారత్‌లో టిక్‌టాక్ సహా 59 చైనా యాప్స్‌పై నిషేధం విధించడంపై అమెరికా స్పందించింది. చైనా యాప్స్‌ను నిషేధించడం భారత సమగ్రత,సార్వభౌమత్వాన్ని కాపాడుతుందని,జాతీయ భద్రతను పరిరక్షిస్తుందని పేర్కొంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో బుధవారం(జూలై 1) ఒక ప్రకటన చేశారు.
భారత్ చైనా యాప్స్‌పై నిషేధం విధించిన మరుసటి రోజే అమెరికా కూడా చైనాకు చెందిన హువావే,జెడ్‌టీఈ కంపెనీలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ రెండు కంపెనీలతో జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న కారణంతో.. ఈ సంస్థల నుంచి చేసే కొనుగోళ్లపై నిషేధం విధించింది. యూనివర్సల్ సర్వీస్ ఫండ్ నుంచి 8.3బిలియన్ డాలర్లతో ఈ సంస్థల నుంచి కొనుగోలు చేసే పరికరాలపై నిషేధం విధించింది.

ఇటు భారత్ కూడా ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్(ఎంటీఎన్‌ఎల్) కంపెనీలు మార్చిలో జారీచేసిన 4జీ అప్‌గ్రేడేషన్ టెండర్‌ను రద్దు చేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా వస్తువులను కొనుగోలు చేయవద్దన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో హువావే,జెడ్‌ఈటీలకు ఈ ప్రాజెక్టులో చోటు దక్కదు.
ఇక బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ చైనీస్ సోషల్ మీడియా యాప్ వీబో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు చైనా మాత్రం భారత్ నిర్ణయాలను తప్పు పడుతోంది. చైనా యాప్స్‌పై నిషేధం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనలకు విరుద్దం అని చెబుతోంది. ఈ నేపథ్యంలో మున్ముందు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ నెలకొంది.
-
అమెరికా సైన్యాన్ని హార్మూజ్ సుడిగుండాల్లో కప్పెట్టేస్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
కొద్దిసేపు మాట్లాడుకున్న రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ.. వీడియో వైరల్ -
మరణించిన చిన్నారులతో ఇరాన్ స్పీకర్ 'శాంతి' ప్రయాణం! -
అమెరికా ప్రయోగించిన అందమైన అస్త్రం: ఒక్క మీటింగ్‌తో గ్లోబల్ స్టార్‌గా..! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..!











Click it and Unblock the Notifications