బటన్ నొక్కితే ఇరాన్ ఖతం! హార్ముజ్ మా గుప్పిట్లో!

ప్రపంచ వాణిజ్యానికి ధమని లాంటి హార్ముజ్ జలసంధిపై అమెరికా తన పట్టును బిగించింది. ఇరాన్‌ను ఆర్థికంగా, సైనికంగా దెబ్బతీసేందుకు అమెరికా నౌకాదళం రంగంలోకి దిగింది. "హార్ముజ్ జలసంధి ఇప్పుడు మా పూర్తి నియంత్రణలో ఉంది. మమ్మల్ని ఎదుర్కొనే శక్తి ఇరాన్‌కు లేదు" అంటూ అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ నేరుగా హెచ్చరించారు. ఇరాన్ తన పంథా మార్చుకోకపోతే యుద్ధ చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

అమెరికా ప్రకటించిన ఈ 'నావికా దిగ్బంధనం' (Naval Blockade) ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేలా ఉంది. ఇరాన్ నుంచి వెళ్లే లేదా అక్కడికి వచ్చే ప్రతి నౌకను అమెరికా నౌకాదళం క్షుణ్ణంగా తనిఖీ చేయనుంది.

US Seizes Control of Hormuz Strait Pete Hegseth Issues Dire Warning to Iran Amid Tensions

ఏమిటి నిషేధం?

ఆయుధాలు, అణు పదార్థాలతో పాటు ముడి చమురు, ఇనుము, ఉక్కు, అల్యూమినియం వంటి వస్తువులను 'నిషేధిత వస్తువుల' (Contraband) జాబితాలో చేర్చారు.

టార్గెట్ 'డార్క్ ఫ్లీట్':

ఆంక్షల నుంచి తప్పించుకుని రహస్యంగా చమురు రవాణా చేసే నౌకలను (Dark Fleet) వెంబడించి మరీ దాడి చేస్తామని అమెరికా కమాండర్ డాన్ కేన్ హెచ్చరించారు.

యుద్ధం ఆగింది: ట్రంప్ సంచలన ప్రకటన
యుద్ధం ఆగింది: ట్రంప్ సంచలన ప్రకటన

"నిశితంగా గమనిస్తున్నాం": హెగ్సెత్ వార్నింగ్

పెంటగాన్ ప్రెస్ బ్రీఫింగ్‌లో హెగ్సెత్ మాట్లాడుతూ ఇరాన్ సైనిక కదలికలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "మీరు బాంబు దాడులతో ధ్వంసమైన మీ క్షిపణి లాంచర్లను బాగు చేసుకునే పనిలో ఉన్నారు. కానీ వాటిని తిరిగి నిర్మించే శక్తి మీకు లేదు. మేము మిమ్మల్ని నిశితంగా గమనిస్తున్నాం. అధ్యక్షుడు ఒక్క బటన్ నొక్కితే చాలు.. మీ ఇంధన పరిశ్రమ నామరూపాల్లేకుండా పోతుంది" అని ఘాటుగా హెచ్చరించారు. ఇప్పటికే 13కి పైగా నౌకలు అమెరికా దెబ్బకు భయపడి వెనుదిరగడం గమనార్హం.

ఇరాన్- అమెరికా యుద్ధంలో చైనానే మెయిన్ విలన్..? షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి..
ఇరాన్- అమెరికా యుద్ధంలో చైనానే మెయిన్ విలన్..? షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి..

ప్రపంచ దేశాల మద్దతు కోరుతున్న అమెరికా

ఈ ఆంక్షల అమలు కేవలం తమ బాధ్యత మాత్రమే కాదని, ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలని హెగ్సెత్ పిలుపునిచ్చారు. హార్ముజ్ జలసంధిలో శాంతి నెలకొనాలంటే ఇతర మిత్ర దేశాల నిబద్ధత కూడా అవసరమని పేర్కొన్నారు. అయితే, ఈ దిగ్బంధనం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చమురు ధరలు గత నాలుగేళ్లలో గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో సామాన్యులపై భారం పడే ప్రమాదం ఉంది.

అమెరికా విధిస్తున్న ఈ 'ఆర్థిక తీవ్రవాదం'పై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మధ్యప్రాచ్యంలో శాంతి కోసం చర్చలు జరుపుతున్నామని చెబుతున్నా, అగ్రరాజ్యం మాత్రం 'లాక్డ్ అండ్ లోడెడ్' (Locked and Loaded) అంటూ యుద్ధానికి సై అంటోంది. ఈ ఉత్కంఠభరిత పోరు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎటు వైపు తీసుకెళ్తుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+