అమెరికా గాయకుడికి సాహిత్యంలో నోబెల్ బహుమతి
స్టాక్ హోం: ప్రముఖ గాయకుడు, పాటల రచయిత బాబ్ డిలాన్‌కు సాహిత్యంలో నోబెల్ బహుమతి వచ్చింది. అమెరికా పాట సంప్రదాయానికి కొత్త ఒరవడి నేర్పారంటూ స్వీడిష్ అకాడమీ ఆయనను కీర్తిస్తూ నోబెల్ బహుమతిని ప్రకటించింది.
1993లో అమెరికన్ నవలా రచయిత టోనీ మారిసన్‌కు నోబెల్ దక్కింది. ఆ తర్వాత ఇప్పుడు బాబ్ డిలాన్‌ను నోబెల్ వరించింది. ఆ తర్వాత దీనిని అందుకున్న తొలి అమెరికన్ ఇతనే.

75 ఏళ్ల బాబ్ డిలాన్ పాడటమేకాక అద్భుతంగా రాయగలరు. వాస్తవానికి ఆయన రచనలు, నవలలు, పద్యాలు, చిన్న కథల కిందకు రాకపోయినా స్వీడిష్ అకాడెమీ ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవడం గమనార్హం.
అవార్డు కింద ఆయనకు 9,27,740 అమెరికన్ డాలర్లు ప్రైజ్ మనీగా అందుతాయి. 1941 మే 24లో మిన్‌లోని దులుత్‌లో జన్మించాడు. హిబ్బింగ్‌లో పెరిగారు. పుట్టిన బాబ్ డిలాన్ 1960ల్లోనే ప్రఖ్యాత గాయకుడిగా, పాటల రచయితగా మారారు. ఫోక్ మ్యూజిషియన్ వూడి గుత్రీ తదితరులు ఇతనికి స్ఫూర్తి.












Click it and Unblock the Notifications