H1B వీసాలతో అమెరికన్ కలల చోరీ...! భారతీయులే టార్గెట్ గా ట్రంప్ కొత్త ప్లాన్..!

అమెరికాలో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి భారతీయుల్ని పదే పదే వివిధ రూపాల్లో టార్గెట్ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్.. మరోసారి తన ద్వేషాన్ని చాటుకున్నారు. అమెరికాను, అమెరికన్లను ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెడతానంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్.. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా అమెరికన్ యువతకు ఉద్యోగాలు రాకపోవడానికి కారణం అక్కడి కంపెనీలు విదేశీ నిపుణుల్ని హెచ్1బీ వీసాలు ఇప్పించి నియమించుకోవడమేనని గుర్తించి వారిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.

ఏడాదికి లక్ష రూపాయలు ఫీజు పెట్టి తాజాగా ఇచ్చే హెచ్1బీ వీసాల జారీ విషయంలో అక్కడి కంపెనీల్ని టార్గెట్ చేస్తున్న ట్రంప్ సర్కార్.. ఇప్పుడు వారిపై మరింత ఒత్తిడి పెంచేందుకు మరో వ్యూహం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా స్ధానిక కంపెనీలు విదేశీయులకు ఇచ్చే హెచ్1బీ వీసాల్ని దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపిస్తూ ఓ యాడ్ తయారు చేసి విడుదల చేసింది. ఇలా కంపెనీలు హెచ్1బీ వీసాల ద్వారా దుర్వినియోగంతో అమెరికన్ యువత కలల్ని చోరీకి సహకరిస్తున్నారని ఇందులో ఆరోపించారు.

US Targets H-1B Visa Abuse in New Ad Citing India

ఇందులో హెచ్1బీ వీసాల్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించడం ద్వారా వారిపై విదేశీ నిపుణుల్ని తీసుకోకుండా ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ సర్కార్ ప్రయత్నిస్తోంది. హెచ్1బీ వీసా దుర్వినియోగం కారణంగా విదేశీ కార్మికుల ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయబడటంతో, యువ అమెరికన్ల నుండి అమెరికన్ డ్రీమ్ దొంగతనం జరుగుతోందని కార్మికశాఖ యాడ్ లో ఆరోపించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, కార్యదర్శి లోరీ చావెజ్-డిరెమర్ నాయకత్వంలో తాము కంపెనీలను వారి హెచ్1బీ దుర్వినియోగానికి జవాబుదారీగా చేస్తున్నామని, అమెరికన్ ప్రజల కోసం అమెరికన్ కలను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపింది.

US Targets H-1B Visa Abuse in New Ad Citing India

51 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో 1950ల నాటి అమెరికన్ కల ఫుటేజ్‌ను, సబర్బన్ ఇళ్ళు, ఫ్యాక్టరీ అంతస్తులు, సంతోషకరమైన కుటుంబాలను ఆధునిక గణాంకాలతో చూపిస్తోంది.హెచ్1బీ వీసాల్ని 71 శాతం మంది భారతీయులే కైవసం చేసుకుంటున్నారని ఇందులో పేర్కొన్నారు. తరతరాలుగా అమెరికన్లు తగినంతగా కష్టపడి పనిచేస్తే వారు అమెరికన్ డ్రీమ్‌ను సాధించగలరని తాము వారికి చెప్పామని, కానీ చాలా మంది యువ అమెరికన్ల కలల్ని దొంగిలిస్తున్నారంటూ ఆక్షేపించారు. రాజకీయ నాయకులు, అధికారులు కంపెనీలు హెచ్1బీ వీసాను దుర్వినియోగం చేయడానికి అనుమతించడంతో వారి ఉద్యోగాలను విదేశీ కార్మికులు భర్తీ చేశారని, కానీ ఇప్పుడు ట్రంప్ యువ అమెరికన్లకు కొత్త అవకాశాన్ని అందిస్తున్నారని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+